తమిళ మంత్రులకు దక్కని శశికళ దర్శనం... 


అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను కలవడానికి బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు వెళ్లిన తమిళనాడు మంత్రులకు చుక్కెదురయింది. చిన్నమ్మను కలిసేందుకు వారికి అనుమతి నిరాకరించారు. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రిగా పళనిస్వామి, మరికొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అందులో డీ శ్రీనివాసన్, సెంగొట్టాయన్, సెల్లూర్ రాజులు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు మంత్రులు మంగళవారం నాడు శశికళను కలిసేందుకు చెన్నై నుంచి బెంగళూరు వచ్చారు. అక్కడి సెంట్రల్ జైలుకు వెళ్లారు. అయితే వారికి అధికారులు అనుమతి నిరాకరించారు.


ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి.. 


ఛత్తీస్ గఢ్ లోని నారాయణ్ పూర్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు తీవ్రవాదులు హతమయ్యారు. పుష్పల్  గ్రామంలోని అడవుల్లో ఈ ఘటన చోటుచేసుకునట్టు మావోయస్టు వ్యతిరేక దళ ప్రత్యేక డీజీపీ అవస్థీ తెలిపారు. దంతేవాడా జిల్లాలోభద్రతా సిబ్బంది కూంబింగ్  నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారని తెలిపిన అవస్థీ... వెంటనే పోలీసులు వారిపై ఎదురుదాడికి దిగినట్టు వివరించారు. ఈ క్రమంలో ఏడుగురు తీవ్రవాదులు హతమైయ్యారు. రెండు రైఫిళ్లు, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ముంబయి పురపాల సంస్థ ఎన్నికలు పూర్తి.. 
bmc polling కోసం చిత్ర ఫలితం

బృహన్ ముంబయి పురపాలక సంస్థ.. బీఎంసీ ఎన్నికల పోలింగ్  ముగిసింది. 227వార్డుల నుంచి పోటీపడుతున్న 2వేల 275మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. మహారాష్ట్రలోని మరో 9 పురపాలక సంస్థలకూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు మిత్రపక్షాలుగా కొనసాగిన భాజపా, శివసేన...బీఎంసీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీచేస్తున్నాయి. పోలింగ్ శాతం  ఈసారి  పరిస్థితి కాస్త మెరుగుపడినట్టు తెలుస్తోంది. ఫలితాలు గురువారం వెలువడనున్నాయి.


ఇక చంద్రశేఖరన్ శకం..
chandrasekaran tata కోసం చిత్ర ఫలితం

టాటా గ్రూప్ ఛైర్మన్ గా చంద్రశేఖరన్  బాధ్యతలు స్వీకరించారు. సైరస్  మిస్త్రీ తొలిగింపు తర్వాత తాత్కాలిక ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న రతన్  టాటా.. ముంబయిలోని టాటా ప్రధాన కార్యాలయమైన బొంబాయి హౌస్ లో గ్రూపు సారథ్య బాధ్యతల్ని చంద్రశేఖరన్ కు అప్పగించారు. ఆ తర్వాత జరిగిన టాటా గ్రూపు బోర్డు సమావేశానికి చంద్రశేఖరన్  తొలిసారి అధ్యక్షత వహించారు. టాటా గ్రూపునకు సారథ్యం వహించే అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తానని చంద్రశేఖరన్  చెప్పారు.


భారీ ధరకు హిట్లర్ ఫోన్ వేలం.. 


1945లో బెర్లిన్‌లోని హిట్లర్ బంకర్‌లో వున్న ఈ టెలిఫోన్ అతడి అరాచకాలకి, రాక్షస క్రీడలకి ఓ మూగసాక్షిగా నిలిచిపోయింది. అలా ఏళ్ల తరబడి హిట్లర్ ఉపయోగించిన ఆ ఫోన్‌ని తాజాగా అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్ అనే సంస్థ వేలానికి పెట్టింది. అమెరికాలో జరిగిన ఈ వేలంలో 2.43,000 డాలర్లు వెచ్చించి మరీ ఈ ఫోన్‌ని కొనుగోలు చేశారు. అయితే, కొనుగోలు చేసిన వారి వివరాలు బహిర్గతపర్చడానికి ఆ సంస్థ నిరాకరించింది. అవును, ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా మిలియన్ల మందిని చంపించిన ఈ రక్తపిశాచి అప్పట్లో జనాన్ని చంపమని చెప్పేందుకు ఓ రెడ్ కలర్ టెలీఫోన్ ఉపయోగించేవాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: