Image result for Luxurious marriage in India hd images


పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటూ అంగరంగ వైభవంగా పెళ్లిళ్ళు జరగటం మనదేశంలో చాలాకాలం నుండి చూస్తూనే ఉన్నాం. అంతే కాదు మనింట్లో పెళ్ళి జరిగిన తీరు చూట్టుపట్ల పాతిక ఊళ్ళలో కూడా పదేళ్ళ పాటు గుర్తుంది పోవాలనే సినిమా తరహా డైలాగులు తరచూ అనేక కుటుంబాల్లో చూస్తూనే ఉన్నం. దీనిద్వారా ప్రజల్లో ఒక రక మైన పోటీ తత్వం డెమాన్స్ట్రేషణ్ ఎఫెక్ట్ పెరిగి అనారోగ్యకరమైన వాతావరణం వారిమధ్య ఏర్పడి ఆర్ధిక స్థోమతల మద్య అంతరం పెరుగుతూ వస్తుంది. అంతేకాదు ప్రభు త్వాలకు కూడా అనేక ఆర్ధిక, సౌకర్యాలు, మానవ వనరుల సమస్య తలెత్తుతుంది.

Image result for Luxurious marriage in India hd images


అందుకే జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వం వివాహాల నిర్వహణపై సమగ్ర నిబంధనలు, విధానాలు ప్రకటించింది.  అక్కడ కూడా పెళ్లంటే ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు, లెక్కకు మిక్కిలి సంఖ్యలో అతిథుల సమక్షంలో అంగరంగ వైభోగంగా జరగాలి, కొన్ని సంవత్సరాల పాటు  జనం తమ ఉంట జరిగిన పెళ్లి గురించే చర్చించుకోవాలి అనే అభిప్రాయాలను ఉన్నత వరగ అధిక అదాయమున్న సంపనున్నల నోట తరచుగా వింటూ వస్తున్నారు.  కానీ, ఇకపై అటువంటి హంగు ఆర్భాటాలకు హంగామాలు చేసే అవకాశం లేకుండా చేయాలని జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 


Image result for huge number of guests in a luxurious marriage in India


తమ రాష్ట్రంలో జరిగే పెళ్లిళ్లకు అతిథులను ఆహ్వానించడంపై పరిమితి విధించింది. 
అమ్మాయి పెళ్లిచేసేవారు గరిష్ఠంగా 500 మందిని, 
అబ్బాయి పెళ్లి చేసేవారు 400 మందినే ఆహ్వానించాలని పేర్కొంది. 
ఇక నిశ్చితార్థం వంటి చిన్నపాటి శుభకార్యాలను 100 మంది అతిథుల సమక్షంలో మాత్రమే జరుపుకోవాలని సూచించింది. 
అంతేకాదు, లౌడ్‌స్పీకర్లు ఉపయోగించడంపై, 
బాణసంచా కాల్చడంపై, 
ఆహ్వాన పత్రికలతో పాటు స్వీట్లు, డ్రైఫ్రూట్స్‌ వంటివి అందించడంపై నిషేధం విధించింది. 


Image result for huge number of guests in a luxurious marriage in India


రాష్ట్రంలోని ప్రజా సంపద ఇతర వనరులు భారీగా జరిగే సంపన్నుల ఇంట పెళ్లిళ్ల పేరిట దుర్వినియోగం కాకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనలు ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కూడా పెళ్లిళ్ల ఖర్చుకు సంబంధించి లోక్‌సభలో ఇదే తరహా బిల్లు ప్రవేశపెట్టను న్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కశ్మీర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నిర్ణయం మంచిదే అంత కఠినంగా అమలు చేయగలరా! 600 కోట్లు తన కూతురి పెళ్ళికి ఖర్చు చేసిన ఘనుడు ముప్పై లక్షళే ఖర్చైనట్లు నిరూపించిన ఘనత ప్రజలకు తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: