సహజంగా మనిషి పామును చూస్తేనే ఆమడ దూరం పరిగెత్తుతాడు. అలాంటిది పాము కాటేస్తే.. ఇంకేముంది ప్రాణాలపై ఆశలు ఒదులుకోవాల్సిందే. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఒక అమ్మాయికి పాము కుడితే ఆమెకు ఎలాంటి హానీ కలగలేదు. ఒక్కసారేనా అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఏకంగా ఆమెను పాము 34 సార్లు కరిచిందట. అయినా ఆమె ఆరోగ్యంగానే ఉంది. ఆ గ్రామ ప్రజలంతా ఈ సంఘటన పట్ల ఆశర్యం వ్యక్తం చేస్తున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని శ్రీమౌర్‌లో 18 ఏళ్ల మనీషా అనే అమ్మాయి 34 సార్లు పాములు కరిచినా ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది.


ఈమెకు నాగదేవతతో సంబంధముందట

అయితే ఇందులో 26 సార్లు ఆమెను శ్వేతనాగే (తెల్లని త్రాచుపాము) కరవడం విశేషం. అయితే ఆమె ఏ ప్రదేశంలోకి వెళ్ళినా శ్వేత నాగు వచ్చి కాటేసి వెళ్లిపోతుందట. ఒక్కోసారి ఒకే పాము రోజుకు రెండు మూడు సార్లు కాటేస్తుందని ఆమె మీడియా తో చెప్పింది. అయినా తమకు ఎలాంటి హాని కలగదని, ఆమెకు నాగాదేవతకు మధ్య అవినాభావ సంబంధం ఉందని ఆమె చెప్పడమే గాక, గ్రామస్తులు కూడా నమ్ముతున్నారట.


ఈమెకు నాగదేవతతో సంబంధముందట

కానీ విషం లేని, తక్కువ విషం కలిగిన పాములు కుట్టడం వల్లనే మనీషా ప్రాణానికి ప్రమాదం తప్పుతోందని డాక్టర్లు చెబుతున్నారు. మెడికల్‌ రిపోర్టుల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 18 వరకు మనీషాకు 34 సార్లు పాములు కరిచినట్టు గుర్తించినట్టు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: