స్వతంత్ర భారత చరిత్రలో రాజ్యాగం నిర్వహించిన శాసనసభ (అంటే రాజకీయ నాయకులు ప్రభుత్వ యంత్రాంగాన్ని శాసించే వ్యవస్థ అన్నమాట)  న్యాయ వ్యవస్థకు సంభందించినంత వరకు రహస్యాలు ఉండకూడదు. ఎందుకంటే శాసన నిర్మాణం చేసినవారే రాజ్యాంగ శాసనాలపీ ఉద్భవించే అన్నీ సమస్యలపై తీర్పులు ఇచ్చే న్యాయ మూర్తులను రహస్యంగా కలిసిన సన్నివేశాలు చాల అరుదు. కనీసం ప్రజలకు తెలిసినవి బట్టబయలైనవి మరీ అరుదు. అయితే సాక్షాత్తు వారికి ప్రత్యేక విందు ఏర్పాటు స్వయానా ముక్యమంత్రే ఇవ్వటమనేది "ప్రశ్నించవలసిన" అవసరం ఉంది.


కృష్ణా తీరాన. పున్నమి ఘాట్‌లో ఏర్పాటు చేసిన ఈ విందు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన సీఎం చంద్రబాబు నాయుడుగారు న్యాయమూర్తులకంటే ముందు వచ్చి చివరన వెళ్లిన వెళ్ళిపోయారనేది,  


అదీ " ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయమూర్తులకు శుక్రవారం రాత్రి విజయవాడ పున్నమి ఘాట్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి నగరానికి వచ్చిన సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఈ విందుకు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విందు ఏర్పాట్లను ఘనంగా చేశారు. న్యాయమూర్తుల కంటే చాలాముందే ఆయన పున్నమిఘాట్‌కు చేరుకున్నారు. విందు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు ఆహార పదార్థాల నుంచి సాంస్కృతిక కార్యక్రమాల వరకు, అన్నింటి నిర్వహణపై అధికారులకు ఆదేశాలిస్తూ హడావుడి చేశారు. పున్నమి ఘాట్‌కు చేరుకున్న న్యాయ మూర్తులకు చంద్రబాబు సాదర స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. న్యాయమూర్తులు పున్నమిఘాట్‌లో దాదాపు రెండు గంటలకుపైగా గడిపారు. విందు అనంతరం న్యాయమూర్తులను చంద్రబాబు ఘనంగా సన్మానించారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే సాధారణ సందర్శకులతోపాటు ఎవరినీ ఘాట్‌ పరిసరాలకు అనుమతించలేదు.

శివరాత్రి సందర్భంగా కృష్ణా నదిలో స్నానం చేసేందుకు వచ్చిన భక్తులను సైతం వెనక్కు పంపించారు. విందు నిర్వహించిన ఘాట్‌ వద్ద ఉన్న పర్యాటక శాఖ పున్నమి గెస్ట్‌హౌస్‌ ఉద్యోగులను కూడా ఆ ప్రాంతంలోకి అనుమతించకపోవడం గమనార్హం. ఎంపిక చేసిన కొద్ది మంది ఉద్యోగులకు ప్రత్యేకంగా పాసులు ఇచ్చారు. విందు నిర్వహణ కు అవసరమైన సిబ్బందిని ఒక ప్రైవేట్‌ హోటల్‌ నుంచి తీసుకొచ్చారు. విందు ఫొటోలు బయటకు రాకుండా, విందు నిర్వహణ సిబ్బంది వద్ద సెల్‌ఫోన్లు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం అధికార కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను ప్రభుత్వం సాధారణంగా విడుదల చేస్తుంది. పేరు ప్రఖ్యాతులున్న న్యాయ మూర్తులకు సీఎం స్వయంగా విందు ఏర్పాటు చేస్తే కార్యక్రమం గురించి మీడియాకు ప్రభుత్వం కనీస సమాచారం, ఫొటోలు కూడా ఇవ్వకపోడం గమనార్హం" ఈ వార్తను ఇక ప్రముఖ తెలుగు దినపత్రిక తన ఆన్ లైన్ వార్తల్లో ప్రచురించింది. 


రాజ్యాంగ విధులు నిర్వహించే రెండు ప్రముఖ రాజ్యాంగ వ్యవస్థల్లోని వ్యక్తుల కలయికలు, సమావేశాలు, విందు వినోదాలు, ఇవన్నీ పారదర్శకంగా ఉండటం ఎంతో అవసరం. అయితే ఈ సమావేశం విండు ఇవన్నీ భారీ బందోబస్తు తో ఫొటోలు కూడా తీయకుండా జాగ్రత్త పడ్డట్టు వార్తలు వచ్చాయి.  


ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిపై వేసిన అనేక వ్యాజ్యాల విచారణపై అనేక న్యాయస్థాలనుండి నిలుపుదల ఉత్తర్వులు వస్తున్న ఈ సమయములో ప్రజాస్వామ్య యుతంగా జరగాల్సిన కార్యక్రమాలలో ఎవరి చిత్తానికి తగ్గట్టు వారు పారదర్శకత లేకుండా ప్రవర్తిస్తుంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్త మనుగడ ఏమిటన్న దానిపై అనెక ప్రశ్నలు, అను మానాలు ప్రజలకు గోచరించటం సహజమే కాదా! రాజకీయ నాయకులు తప్పులు చేస్తారు అదే దారిలో న్యాయ వ్యవస్థల్లో అతి కీలక స్థానాల్లో ఉండే న్యాయ మూర్తులు అలాగే ప్రవర్తిస్తే రాజ్యాంగ వ్యవస్థపై ప్రజలకు అనుమానాలు పొడచూపటం సహజమే కదా!  ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధినేత న్యాయమూర్తుల రహస్య సమావేశం హర్షనీయమా? అదీ ప్రజలకు న్యాయవ్యస్థపై ఇంకా నమ్మకం కోంచమైనా ఉన్న తరుణంలో.  న్యాయమూర్తులే సమాధానం చెప్పాలి మరి.


ఈ ప్రజాస్వామ్యవ్యవస్థ,  ఏ కొందరు వ్యక్తులకో,  కులాలకో,  మతాలకో,  జాతులకో,  ఆధిపత్యాలకో,  సమూహాలకో,  చివరకు వ్యక్తులకో సంభందించింది కానప్పుడు అను మానాస్పదంగా ఏదీ కనిపించకూడదు. సరిగ్గా ఉండటం ఎంత ప్రధానమో సరిగ్గా ఉన్నట్లు కనపడటం అంతే అవసరం. న్యాయవ్యవస్థకు చెందిన సదస్సులో ప్రజా సముఖాన ఎవరైనా రావచ్చు, మాట్లాడొచ్చు, చర్చించవచ్చు కాని గోప్యత పాటించే సన్నివేశాలకు అవకాశమిస్తే 130 కోట్ల భారత ప్రజలకు ఈ రాజ్యాంగ వ్యవస్థ పై అను మానం పొడచూపితే  'తొలుత ప్రశ్నధాటికి గురయ్యేది న్యాయవ్యవస్థె'  


ప్రజలకు ఒక అనుమానం బహుముఖంగా,  ప్రబలంగా ఉన్నదేమంటే  "ప్రతిపక్షనాయకులు నేరం చేసి దొరికి శిక్షపడ్డ వాళ్ళు, ఇంకా విచారణలు కొనసాగుతున్న దశలో ఉన్నవాళ్ళు.  అధికారపక్ష నాయకులు నేరం చేసినా ఇంకా ఋజువు అయ్యే సమయం వచ్చేవరకు నేరస్తులుగా ప్రకటించబడని వాళ్ళనే"  ప్రచారం ప్రజల్లో విపరీతంగా ఉండటమే ఈ ప్రశ్నార్ధక వాతావరణానికి కారణం. అంతేకాదు ప్రధాన మీడియా ప్రభుత్వానికి వంత పాడుతుందని ప్రజలు అనుమానం లేకుండా నమ్ము తున్న సంధర్భంలో ఈ కంఫ్యూజన్ నివారించవలసిన వ్యక్తిగత అవసరం ఏ వ్యవస్థకుందో ఆ వ్యవస్థే సమాధానం ఇస్తే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: