ప్రకృతి కోపిస్తే ఎంతటి వినాశనం జరుగుతుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  గాలి,నీరు, నిప్పు వీటిలో  ఏది ప్రమాద స్థాయి దాటినా పెను విధ్వంసం కావాల్సిందే.  తాజాగా ఆగ్నేయ చైనాలోని నాన్‌చాంగ్ నగరంలో గల నాలుగు అంతస్థుల హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 10 మంది మరణించినట్లు సిన్హువా వార్తా సంస్థ తెలిపింది.  ఒక్కసారిగా భవనాన్ని అగ్నికీలలు చుట్టుముట్టడంతో హోటల్ సిబ్బంది, హోటల్‌లో ఉన్నవారు బయటకు రాలేక అందులో చిక్కుకుపోయారు.
Image result for china hotel fire accident
పెద్ద సంఖ్యలోనే ప్రజలు అందులో చిక్కుకుపోయి ఉంటారని తెలుస్తున్నా ఎంతమంది అనేది పక్కా సమాచారం లేదు. నాలుగు అంతస్తుల ఈ హోటల్‌ మరో 24 అంతస్తుల భవనంతో కలిసి ఉంది. మంటలు చుట్టుముట్టడంతో రెండో అంతస్తు నుంచి దూకిన ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
Image result for china hotel fire accident
సమాచారం అందుకున్న పది అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.  ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: