ప్రపంచంలో రోజు రోజుకీ ఉగ్రవాదుల పైశాచిక ఆగడాలు మితిమీరిపోతున్నాయి.  వారి లక్ష్యానికి అమాయక ప్రజలు బలి అవుతున్నారు.  ప్రపంచంలో ఏ మూలన ఎక్కడ బాంబు పెలుళ్లు సంబవిస్తాయో అని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికే పరిస్థితి దాపురించింది.  అగ్ర రాజ్యాలు కూడా నేడు ఉగ్రవాద చర్యలకు బయపడుతూనే ఉన్నాయి.  తాజాగా సిరియా రాజధాని డమాస్‌కస్‌లో జంటపేలుళ్లు సంభవించాయి.  భద్రత స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆరుగురు ఆత్మాహతి దళ సభ్యులు దాడికి పాల్పడ్డారు.
సిరియాలో ఆత్మాహుతి దాడి; 32 మంది మృతి
ఈ ఘటనలో కనీసం 32 మంది మరణించగా, మరో 24 మంది గాయపడ్డారు. హామ్స్ మిలటరీ ఇంటలిజెన్స్ చీఫ్‌ జనరల్ హాసన్ దాబౌల్ మరణించినట్టు సిరియా న్యూస్ ఛానెల్ వెల్లడించింది. గడిచిన 14 నెలలుగా డమాస్‌కస్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మాహుతి దళానికి చెందిన ఆరుగురు సభ్యులు  రెండు గ్రూపులుగా రెండు చోట్ల పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో మిలటరీ ఇంటలిజెన్స్ బిల్డింగ్ తీవ్రంగా దెబ్బతింది.

ఇదిలా ఉండగా, టర్కీ భద్రతా బలగాలు గతేడాది ఆగస్టు నుంచి అలెప్పో నగరంలో ఐఎస్‌ వ్యతిరేక ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. అల్‌-బాబ్‌ నగర పౌరులకు ఐఎస్‌ చెర నుంచి విముక్తి కల్పించామని టర్కీ సైన్యం ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆత్మాహుతి ఘటన చోటుచేసుకున్నది. ఈ దాడికి పాల్పడింది ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సివుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: