కళ కళ కోసమే కాదు, ప్రజలకోసమని నమ్మి త్రికరణ శుద్ధిగా పాటించారు ఎన్టీఆర్. 1965 నాటి ఇండో పాక్ యుద్ధ సమయంలో రక్షణ నిధి కోసం ఎన్టీఆర్ నాటి సినీ కళాకారులు, సాంకేతిక బృందంతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో 'జైత్రయాత్ర' నిర్వహించారు. ఎన్టీఆర్ పిలుపును అందుకుని 180 మంది జైత్రయాత్రలో పాల్గొనేందుకు సిద్ధపడ్డారు. 



వీరందరూ  ఎన్. ఏ. టి. ఆఫీసులో సమావేశమయ్యేవారు. మూడు వారాల జైత్ర యాత్రలో , ఏ రోజున ఏ గంటలో ఏమి చెయ్యాలో వీరందరికీ షెడ్యూల్ ఖరారు చెయ్యబడింది. ఒక క్రమ పద్ధతిలో, ఒక మహా సైన్యం కదలినట్లు క్రమ శిక్షణలో నడిచే విధంగా ఈ కార్యక్రమావళిని ఏర్పాటు చేయడానికి ఎన్టీఆర్ నేతృత్వంలో ఎన్.ఏ. టి. కార్యాలయ సిబ్బంది మొత్తం ఏంటో కృషి చేశారు. 
ఎన్టీఆర్ కు అన్నివిధాలా తోడుగా సోదరుడు త్రివిక్రమరావు సాయపడేవారు. 


ఎన్టీఆర్ సారధ్యంలో మూడు బస్సులు, వాన్, 12 కార్లు, 180 మంది జనంతో నాటి జైత్రయాత్ర నిర్వహించబడింది. ఆంధ్రదేశమంతటా 19 రోజులు, సుమారు 2,680 మైళ్ళు పర్యటన సాగింది. 16 పట్టణాలలో 9 ప్రదర్శనలిచ్చారు. 15 స్ట్రీట్ ర్యాలీస్ ఇచ్చారు. సుమారు 10 లక్షల రూపాయలు జవాన్ల నిధికి సమర్పించారు. 


ఒక లారీ నిండేటంతటి బట్టలు , వస్తువులు, సుమారు 4000 గ్రాముల బంగారం వచ్చింది. 500 ఫౌంటెన్ పెన్నులు, 200 రిస్టు వాచీలు వచ్చాయి. ఇవన్నీ నిధికి సమర్పించబడ్డాయి. 
ఇంత పట్టుదలతో, పకడ్బందీగా అంత పెద్ద కార్యక్రమం నిర్వహించడానికి కార్యదక్షత ఒక్కటే కాదు అచంచలమైన దేశభక్తి కూడా ఉండాలి. అది ఎన్టీఆర్ మనసునిండా ఉంది. అదే ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు మార్గం చూపింది.



మరింత సమాచారం తెలుసుకోండి: