గత దశాబ్ద కాలంగా ఈ దేశం లో నిరుద్యోగం అనేది చాలా పెద్ద అంశంగా మారిపోయింది. రాజకీయంగా కూడా దీనికి ఎక్కడ లేని ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతీ రాజకీయ మీటింగ్ లో , వాగ్దానం లో, అజెండా లో ప్రతీ రాజకీయ పార్టీ నిరుద్యోగులు లేకుండా చేస్తాం అన్న ఒకే ఒక్క ప్రకటన తో నిరుద్యోగులని తద్వారా యువత ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.


రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు లేని వారి సంఖ్య కోట్లలోనే ఉంది. మరి ఉద్యోగాల నే తన హామీలలో ప్రధానంగా చేర్చుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు , మరొక పక్క తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇద్దరూ ఉద్యోగాలని తమ ఫామిలీ వరకూ పంచుకున్నారు అనే ఒక సెటైర్ ఇద్దరి మీదనా ఉంది.


తెలంగాణా కి హైదరాబాద్ ఆస్తిగా ఉంది కాబట్టి కాసిన్నో కూసిన్నో ఉద్యోగాలు వద్దు అన్నా వస్తున్నాయి కానీ ఏపీ పరిస్థితి మాత్రం నిరుద్యోగుల మీద దయ చూపేలా పరిస్థితి కనపడ్డం లేదు. నీళ్ళ విషయం లో తరవాత నిధుల విషయం లో మొదట సమస్యలు ఎదురుకొన్న కెసిఆర్ ప్రభుత్వం వెంట వెంటనే రెండింటినీ అందిపుచ్చుకుని దాటవేసింది.


కానీ ఉద్యోగాలు ఇస్తాం అంటూ ఎలక్షన్ టైం లో చెప్పిన మాట నెరవేర్చుకోవడం తేలికైన విషయం కానే కాదు. ఏపీ లో చంద్రబాబు దీ అదే పరిస్థితి. జాబు రావాలి అంటే బాబు రావాలి అనే నినాదం తో ముందుకు వెళ్ళిన టీడీపీ సర్కారు ఇప్పుడు నిరుద్యోగ భ్రుతి కూడా ఇచ్చే పరిస్థితి లో లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ ఉద్యోగాలు ఇవ్వలేని తీరు రెండు చోట్లా ఉన్న ప్రతిపక్షాలకి అతిపెద్ద పాజిటివ్ పాయింట్ గా మారిపోయి వారు వీరిని చెడా మడా ఆడుకునేలా చేస్తోంది. అదిగో ఉద్యోగాలు ఇచ్చాం ఇదిగో ఉద్యోగాలు ఇచ్చాం అనడమే తప్ప ఎక్కడా అవి కనపడక జనం విసుగులో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: