ఒక డ్రైవర్ ఏదేనీ వాహనం నడుపుతున్నప్పుడు అతని శ్రద్ధ దేనిపై ఉండాలి..? డ్రైవింగ్ పైనా మరేదానిపైననా...? పక్కా డ్రైవింగ్ పైనే కదా. మరి ఈ బస్ డ్రైవర్ తను ఒక బస్ డ్రైవర్ అని, ఏమాత్రం నిర్లక్ష్యంచేసినా అతని ప్రాణాలతో పాటు అందులో ఉన్న ప్రయాణికుల ప్రాణాలను కూడా ప్రమాదం అని తెలిసి కూడా, వాహనం లో ఉన్నవారంతా చూస్తున్నారని అనే ఆలోచన కూడా లేకుండా పడే పడే సెల్ వైపు చూస్తూ బస్సును ఎలా నడుపుతున్నాడో.. మీరే చూడండి. 



కడప నుంచి కర్నూలు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ రెండు ఫోన్లకు ఛార్జింగ్‌ పెట్టి.. ఒకచేత్తో బస్సు నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతూ డ్రైవింగ్‌ చేశాడు. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచే ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. కడప నుంచి కర్నూలు వెళుతున్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ విధుల సమయంలో రెండు సెల్‌ఫోన్లు ఉపయోగిస్తూ డ్రైవింగ్‌ చేశాడు.


Image result for rtc bus driving

ఛార్జింగ్‌ పెట్టిన ఆ ఫోన్లను బస్సు నడుపుతూనే క్షణానికోసారి చూస్తూ బస్సును వేగంగా నడపసాగాడు. అసలే వరుస రోడ్డుప్రమాదాలతో భయాందోళనలకు గురవుతున్న ప్రయాణికులు ఈ వీడియో చూసి షాక్‌కు గురవుతున్నారు. ఇలాంటి కారణాల వల్లే ప్రయాణికులు మృత్యు వాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: