తెలుగు రాష్ట్రాలో రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి రాగా..తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలు కనుక ఇద్దరు ముఖ్యమంత్రులు రాష్ట్రాల అభివృద్ది కోసం బాగానే కష్టపడుతున్నారు.  రెండు రాష్ట్రాల్లో అభివృద్ది సంక్షేమ పథకాలు అమల్లోకి రావడం...ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి తెగ కష్టపడుతున్నారు.   అయితే తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన వివిధ ఎన్నికల్లో టీఆర్ఎస్ జండా ఎగుర వేసింది.  కాగా ఆంధ్రప్రదేశ్ లో రీసెంట్ గా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.  
Image result for ysrcp
అయితే ఈ ఎన్నికల్లో టీడీపి  దూసుకుపోతోంది. నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంది. వైకాపా అధినేత జగన్ సొంత జిల్లా అయిన కడపలో, ఏకంగా వైయస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి ఓటమిపాలు కావడంతో ఆ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆయనపై బీటెక్ రవి విజయదుందుభి మోగించారు. దీంతో, జగన్ జిల్లాలో టీడీపీ జెండా ఎగిరింది.
Image result for tdp
ఇక కడప ప్రాంతంలో ఇంతకాలం కొనసాగిన ఫ్యాక్షన్ రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ చరమగీతం పాడిందని, తెలుగుదేశం పార్టీ నేత కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. జగన్ సొంత జిల్లా కావడంతో వైసీపీ శ్రేణులు ఇక్కడ విజయం కోసం తీవ్రంగా శ్రమించాయి. అయినా, ఫలితం దక్కకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి. మరోవైపు, ఈ అద్భుత విజయంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. చంద్రబాబు పాలనకు ఫలితమే ఈ విజయం అని వారు అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: