కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పరాజయంతో కడపలో వైసీపీ ప్రభ తగ్గినట్టేనన్న విశ్లేషణలు వస్తున్నాయి. జగన్ ఇలాకాలో కూడా చంద్రబాబు పాగా వేశాడని అంటున్నారు. కానీ వాస్తవాలు పరిశీలిస్తే.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తాయి. నలభయేళ్ళుగా కడప వైఎస్ కుటుంబం కంచుకోట అనే ప్రచారంలో వాస్తవం లేదట. 



1983 నుండి 2004 దాకా కడప జిల్లా తెదేపా కంచుకోట. అప్పుడున్న 11 అసెంబ్లీ స్థానాల్లో 1983లో 8, 1985లో 8, 1994లో 7, 1999లో 8 కొట్టింది తెదేపా. 1989లో రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 1991లో కడప లోక్‌సభకి నాలుగు లక్షల మెజారిటీతో గెలిచిన వైఎస్సార్ 1996 లోక్‌సభ ఎన్నికల్లో 5 వేల ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు.



1998లో లోక్‌సభకి వైఎస్ కు వచ్చిన మెజారిటీ బొటాబొటి 50,000. 1999లో వివేకాకి వచ్చిన మెజారిటీ మరీ హీనంగా పాతికవేలే. అప్పుడు రాజంపేట కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి సాయిప్రతాప్‌ని ఓడించి తెదేపా గెలుచుకుంది. ఒకరకంగా వైఎస్ కుటుంబంకన్నా సాయిప్రతాప్ మెరుగు. ఎప్పుడూ ఒకే రేంజ్ మెజారిటీతోనే గెలిచాడు, ఓడాడు.



1984లో కడప, రాజంపేట రెండు లోక్‌సభ సీట్లూ తెదేపానే గెలిచింది. 1996, 1998, 1999 సంవత్సరాల్లో స్వల్పవ్యవధిలోనే వరసగా మూడుసార్లు పార్లమెంటు ఎన్నికలు వచ్చి, రెండుసార్లు వైఎస్సార్, ఒకసారి వివేకా గెలవడంవల్ల అక్కడేదో గ్లామర్ క్రియేట్ అయిందని తెలుగు దేశం నేతలు అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: