ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చెపట్టగానే కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్తున్నారు.  యూపీలో గోవుల అక్రమ రవాణాపై ఆయన పూర్తిగా నిషేధం విధించారు. అంతేకాకుండా, రాష్ట్రంలో ఉన్న జంతు వధశాలలను మూసివేతకు ప్రణాళికలు రచించాలని ఆయన అధికారులను కోరారు. గోవుల అక్రమ రవాణాపై పూర్తి నిషేధం విధించారు.  అంతే కాదు తాను జారీ చేస్తోన్న‌ ఆదేశాలను తప్పకుండా పాటించాల్సిందేనని ఆయ‌న‌ తేల్చిచెప్పారు..లేదంటే కఠిన శిక్షలు అమలవుతాయిన హెచ్చరించారు.  
Image result for cows exporting
యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ కు అభినందనలు వెల్లువిరుస్తున్నాయి.  తాజాగా సీఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయంపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభినందనలు తెలిపారు. భారతీయ జనతా పార్టీలో హిందూత్వ నేతగా విశేష గుర్తింపు పొందిన ఆయనకు మంచి జరగాలని ఆకాంక్షించారు.   కైఫ్ తన ట్విట్ లో  "ప్రతి ఒక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది.
Mohammad Kaif's Message After Yogi Adityanath Took Over as UP Chief Minister
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలపై అప్పటికప్పుడే అనుమానాలు వ్యక్తం చేసేకంటే.. వారికి  శుభాకాంక్షలు చెప్పడం మంచిది. వారి హయాంలో భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.  అంతేకాకుండా, "యోగి ఆదిత్యనాథ్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఆయన పాలనలో యూపీ అభివృద్ధి సాధించాలని, ప్రజలకు ఆయన గొప్ప భవిష్యత్తును ఇస్తారని ఆకాంక్షిస్తున్నా..." అని తెలిపాడు. 

కైఫ్ ట్విట్ :




మరింత సమాచారం తెలుసుకోండి: