చంద్రబాబు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన మంత్రి వర్గమే ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే త్వరలో బాబు మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనునట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో మంత్రులంతా ఎప్పుడు తన పదవి ఊడుతుందో అని తెగ టెన్షన్ పడుతున్నారట. కొత్తఃగా లోకేష్ గా మంత్రి పదవిని కట్టబెడతారని, భూమా అఖిల ప్రియను కూడా మంత్రి వర్గంలో చేర్చుకోనున్నారని పచ్చ పార్టీలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. వీరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలంటే ఇప్పుడున్నవారిలో కొందరికి ఉద్వాసన పలకాల్సిందే అని బాబు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.


Image result for ap ministers
ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న వారిలో కనీసం ఐదుగురు మంత్రులకు చంద్రబాబు ఉద్వాసన పలకనున్నారు. వారిలో ప్రముఖంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని, ఎక్సైజ్ - బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు పేర్లున్నాయి. వీరు కాకుండా అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి (చిత్తూరు), సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి (అనంతపురం) లను కూడా తప్పిస్తారని వినిపిస్తోంది. ఇంకా మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి.నారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, రవాణా మంత్రి సిద్ధా రాఘవరావుల పేర్లు కూడా తొలుత ఉద్వాసన పలికే జాబితాలో ఉన్నా.. ఆ తర్వాత వచ్చిన ఒత్తిళ్ల మేరకు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్టు తెలిసింది.

Image result for ap ministers

మంత్రుల్లో ఎవరు ఏ జాబితాలో...

సేఫ్ జాబితా : చిన రాజప్ప, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, సీహెచ్ అయ్యన్నపాత్రుడు, పరిటాల సునీత, కె. అచ్చన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు.

డౌట్ జాబితా : బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, పల్లె రఘునాధరెడ్డి, సిద్ధా రాఘవరావు. (ఇందులో ఒకరు లేదా ఇద్దరిని తప్పించడం ఖాయమని తెలుస్తోంది)

ఔట్ జాబితా : కిమిడి మృణాళిని, కొల్లు రవీంద్ర, పీతల సుజాత, రావెల కిషోర్ బాబు.



మరింత సమాచారం తెలుసుకోండి: