సాధారణంగా పోలీసులు అంటేనే సామాన్య ప్రజలకు కాస్త భయం..కంగారు.  కాకపోతే వారు మనకు రక్షణ ఇచ్చే బాధ్యతతో కాస్త కఠినంగా ఉంటారు. లేదంటే సమాజంలో నేరాల సంఖ్య పెరిగిపోతుంది.  అయితే గత కొంత కాలంగా భారత దేశంలో మహిళా పోలీసులకు కూడా మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు.  హోంగార్డు నుంచి ఐజీ ల వరకు మహిళలు బాధ్యాతయుతంగా పనిచేస్తున్నారు.  

తాజాగా ఓ స్టేషన్లో కొంత మంది మహిళా పోలీసులు షర్టు విప్పి మరీ డ్యాన్స్ చేస్తూ నానా హంగామా చేశారు.  అసలు విషయానికి వస్తే.. ఉత్తర ప్రదేశ్ లో పనిచేస్తున్న మహిళా పోలీసులు దాదాపు నెలరోజులుగా ఎన్నికల బందోబస్తులో అహర్నిశలు శ్రమించిన వీళ్లు ఎన్నికల ఫలితాలు రావడంతో కాస్త రిలాక్స్ అయ్యారు.  దీంతో ఉల్లాసంగా లయబద్ధంగా చిందులేసి తెగ హల్ చల్ చేశారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: