ఆంధ్రాలో తెలుగు దేశం సర్కారు పనితీరుపై ఘాటు విమర్శలు చేస్తున్న సాక్షి మీడియాను చంద్రబాబు కట్టడి చేయాలనుకుంటున్నారా.. మిగిలిన మీడియా అంతా దారికి వచ్చినా ఒక్క సాక్షి కారణంగా తన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారా.. స్పీకర్ కోడెలపై సాక్షి మీడియా కథనాలను ఇందుకు అడ్డం పెట్టుకుంటున్నారా..


ఇప్పుడు ఈ అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. స్పీకర్ ప్రెస్ మీట్ వ్యాఖ్యలను అన్ని మీడియాలు ప్రచురించినా ఒక్క సాక్షిపైనే చర్యలు తీసుకోవాలని ప్రయత్నించడం ఇందుకు ఊతమిస్తోంది. కానీ చంద్రబాబు మాత్రం అలాంటి కక్ష ఏమీ లేదంటున్నారు. చంద్రబాబు గతంలో ఎన్టీవీనీ ఇలాగే దారికి తెచ్చుకున్నారు కూడా. 
మీడియాపై ప్రభుత్వం కక్ష్య సాధిస్తోందని జగన్‌ చేసిన విమర్శలకు సీఎం స్పందించారు. 


పత్రికల మీద కక్ష కట్టాల్సిన అవసరం తమకేం ఉందని అన్నారు. . ఏ మీడియా పట్లా  ప్రభుత్వం కక్ష్య సాదించదు. సాక్షి ఇష్టం వచిన్నట్లు అసత్యాలు ప్రసారం చేస్తూఉంటే చూస్తూ ఉరుకోవాలా అని ప్రశ్నించారు. సభాపతిపై అవిశ్వాసం పెడితానంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలపైనా సీఎం స్పందించారు. సభా సమయం వృధా తప్ప ఒరిగేదేమీలేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. 


 అవిశ్వాసం ఎందుకు పెడతారు..? ఇప్పుడేం ఇష్యూ ఉందని ఆయన ప్రశ్నించారు.  స్పీకర్ వ్యాఖ్యలను జాతీయ మీడియా వక్రీకరించడానికి మూలమూ వైసీపీనే అని ఆయన అన్నారు. తప్పుగా ప్రచారం చేస్తున్నారని తాము జాతీయ మీడియాకు చెబితే ఆపేశారని ఆయన తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: