ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రత్యక్ష కారణం టీఆర్ఎస్ పార్టీ యే అయినా పరోక్ష కారణం మాత్రం కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ అనే విషయం అందరికీ విదితమే. అయితే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినా అధికారం మాత్రం గులాబీ పార్టీకే వరించింది. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టకపోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీలో సమన్వయ లోపం తోపాటు కేసీఆర్ కి ధీటుగా సరైన నాయకుడు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.


'గాంధీభవన్‌లో కూర్చొని గడ్డాలు పెంచితే సరిపోదు'

అయితే అప్పుడు దక్కని అధికారాన్ని కనీసం వచ్చే ఎన్నికల్లో అయినా దక్కించుకుందామని కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు తప్పి కొడుతున్నారు గులాబీ నేతలు.  శాసనమండలిలో నిన్న డ్జెట్ పద్దులపై చర్చ జరిగిన సందర్భంగా, టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిమయమైందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతల తీరు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు ఉందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.


Image result for ktr

స్కాములు, స్కీముల్లో తలమునకలైన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. స్కీములు, స్కాములకు పాల్పడింది కాంగ్రెస్సే.. 40 ఏళ్లు పాలించి ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్‌ ఓర్వలేక పోతుందన్నారు. రాష్ట్రం బాగుపడుతుంటే సహకరించాలి కాని ఓర్వలేకపోవడం దారుణమన్నారు. గాంధీభవన్‌లో కూర్చొని గడ్డాలు పెంచుకోవడం వల్ల అభివృద్ధి సాధ్యం కాదన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: