తెలంగాణ లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పరువును, పతిష్ట ను కాపాడే పనిలో పడింది.  కాంగ్రెస్ నీనియర్ నాయకులంతా వచ్చే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదివరకంటే ఎక్కువ పార్టీ స్థానాలను దక్కించుకోవాలని తహతాహలాడుతుంది. కాంగ్రెస్ పార్టీలో కొంత మంది సీనియర్ నాయకులు హస్తం పార్టీకి హ్యాండిచ్చి కారు పార్టీలోకి వెళ్లిన సందర్భంలో హస్తం పార్టీపై నమ్మకం ఉన్న కాంగ్రెస్ నేతలంతా తమ పార్టీ పరువు మరింత దిగజారకుండా చూసుకోవడానికి తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.


Image result for సీఐపై ఫైర్ అయిన వీహెచ్.. రాజీనామా చేస్తానంటున్న సీఐ

ఈ ప్రయత్నం చేసే వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు ముందున్నారు. తెలంగాణ అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్దకు వెళుతున్నప్పుడు సీఐ సుధాకర్ అడ్డుకున్నారు. దీంతో, సుధాకర్ పై వీహెచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నన్ను ఆపడానికి నీవు ఎవడ్రా?' అంటూ సీఐను వీహెచ్ బండబూతులు తిట్టారు. తన పట్ల వీహెచ్ ప్రవర్తించిన తీరుకు సీఐ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.


సీఐపై ఫైర్ అయిన వీహెచ్.. రాజీనామా చేస్తానంటున్న సీఐ

ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. ఎస్సీ కులానికి చెందిన తనను వీహెచ్ కులం పేరుతో దూషించారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లానని... అయినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. తన సొంత డిపార్ట్ మెంట్ లోనే తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: