తెలంగాణలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పడూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసే కాంగ్రెస్ సీనియర్ నేత మరోసారి రెచ్చిపోయారు.  అయితే ఈ సారి ఏకంగా  ఏఎస్‌ఐ ని బండ బూతులు తిడుతూ..హడావుడి చేశారు.  వివరాల్లోకి వెళితే..తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు మాట్లాడేందుకు సీనియర్ నేత విహెచ్ రాగా, అందుకు అనుమతి లేదంటూ అక్కడ విధుల్లో ఉన్న అదనపు ఇన్‌స్పెక్టర్‌ పాములపర్తి సుధాకర్‌ అడ్డుకున్నారు.  దీంతో చిర్రెక్కిన వీహెచ్ ఏఎస్‌ఐ సుధాకర్‌ పై తిట్ల దండకం చదివారు.
Image result for v hanumantha rao
మీడియా పాయింట్‌ వద్ద ప్రస్తుత సభ్యులే మాట్లాడాలని, మాజీలకు అవకాశం లేదని, అందువల్ల వెళ్లిపోవాలని సుధాకర్‌ చెప్పారు.  దీంతో మరింత కోపోద్రిక్తుడైన వీహెచ్ ‘అరే.. నువ్వు ఎవడ్రా బై నాకు చెప్పేది!. నన్నే అడ్డుకుంటావా?. ఆరేయ్‌.. నీ అంతు చూస్తా.. మేం మాట్లాడానికి కూడా మీ అనుమతి తీసుకోవాలా?. ఇదేనా ప్రజాస్వామ్యం?.’ అంటూ నిప్పులు చెరిగారు. దీంతో ఏం చేయాలో పాలు పోక ఆ ఎస్సై అక్కడ నుంచి వెళ్లి పోయారు. ఓ సీనియర్ రాజకీయ నేత అయి ఉండి కూడా విధుల్లో ఉన్న పోలీస్ పై విచక్షణ మరిచి మాట్లాడం ఎంత వరకు న్యాయమని  తనకు జరిగిన అవమానాన్ని సోషల్‌ మీడియాలో వివరించారు.

వీహెచ్‌ తనను దూషించారని, దళితుడైనందు వల్లే ఇలా చేశారని , ఉన్నతాధికారులకు ఫిర్యారు చేసినా పట్టించుకోలేదని ఆవేదన చెందారు. అయితే డ్యూటీలో ఉన్న తనను దూషించిన వీహెచ్‌పై శుక్రవారం సైఫాబాద్‌ ఠాణాలో ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, ఐపీసీ 353, 294-బి, 504 సెక్షన్ల కింద వీహెచ్‌పై కేసు నమోదు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: