ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీని ప్రతిసారి రచ్చ రచ్చ చేస్తూ ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఎమ్మెల్యే రోజా గత కొన్ని రోజులుగా నిశ్శబ్ధంగా ఉంది.  అసెంబ్లీలో ఎంత రగడ జరుగుతున్నా ఆమె ఒక్కమాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటున్నారు.  ఈ మద్య ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మహిళా ఎమ్మెల్యేలు, పురుష ఎమ్మెల్యేలు దాదాపు కొట్టుకునే పరిస్థితికి వచ్చినా కూడా దీనిపై ఏమాత్రం స్పందించలేదు రోజా. అలాంటిది ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి తీవ్ర విమర్శలు చేసింది..తనదైన స్టైల్లో సంచలన వ్యాఖ్యలు చేసింది.
Image result for amaravathi city design
మీడియాతో మాట్లాడుతూ..అమరావతి రాజధాని నిర్మాణాల తాలూకు డిజైన్లు విడుదల చేస్తూ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ''బాహుబలి 1, బాహుబలి 2 బాహుబలి 3 అన్నట్లుగా వరుసగా సినిమాలు చూపిస్తున్నారు, కొత్తకొత్త డిజైన్లతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు.ఫోటోలతో మభ్యపెట్టారు. పొగ గొట్టాలతో డిజైన్లు ఎత్తుకొచ్చారు.     సింగపూర్ డిజైన్లను గాలికి వదిలేశారా? అని ప్రశ్నించారు.
Image result for amaravathi city design
గ్రాఫిక్స్ మాయజాలంతో మాయల మరాఠీల వ్యవహరిస్తున్నారు కాబట్టే వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆ ప్రజంటేషన్‌కు వెళ్లలేదని రోజా చెప్పారు.  మాకీ సంస్థతో ఒప్పందాలు చేసుకుని మరో సంస్థకు మార్చడం వెనుక మతలబు ఏంటో చెప్పాలన్నారు. ఎవరితోనూ చర్చించకుండానే చంద్రబాబు రాజధానిని ఎంపిక చేశారని, ఆనాడు రాజధాని ఎంపిక విషయంలో ప్రతిపక్షాన్ని, అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని రోజా ప్రశ్నించారు.

రాజధానిలో డిజైన్లలో 51శాతం గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకునే చంద్రబాబు.. మూడు పంటలు పండే 33వేల ఎకరాల భూమిని లాక్కుని ఎక్కడ నుంచో తెచ్చి చెట్లు పెడతామని చెవిలో కాలీఫ్లవర్లు పెడుతున్నామని రోజా ఎద్దేవా చేశారు.   ఒక్క ఇటుకరాయి కూడా పెట్టకుండా డిజైన్లతో రాజధానిలో ఏదో జరిగిపోతుందన్న భ్రమ కల్పిస్తున్నారు. మీ మాయామహల్ మాయలను ఆపండి" అంటూ రోజా ధ్వజమెత్తారు.  చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజల చెవిలో కాలీ ఫ్లవర్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: