ఆస్ట్రేలియాలో కొందరు దుండగులు ప్రవాస భారతీయుడిని జాతి వివక్షతో దూషించి, రక్తం వచ్చేలా దాడి చేశారు. హోబర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఈ జాతి విద్వేష చర్య జరిగింది.  వారంలో రెండోసారి భారతీయుడిపై దాడి జరిగింది. కేరళలోని కొట్టాయం సమీపంలోని పుత్తపల్లికి చెందిన జాయ్ ఎనిమిదేళ్లగా కుటుంబంతో హోబర్ట్‌లో నివసిస్తున్నాడు. ఆటోమొబైల్ ఇంజినీర్ అయిన జాయ్ వీకెండ్స్‌లో ట్యాక్సీ నడుపుతుంటాడు. ట్యాక్సీకి వెళ్లొచ్చిన జాయ్ కాఫీ తాగేందుకు ఉత్తర హోబర్ట్‌లోని మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్ వద్దకు వెళ్లాడు.


భారతీయుడిని రక్తం వచ్చేలా కొట్టారు!

అక్కడ కారు ఆపుతుండగానే అప్పటికే కొందరు యువకులు (అందులో ఒక యువతి కూడా ఉంది) రెస్టారెంట్‌లోని సిబ్బందితో గొడవపడుతున్నారు. గొడవ పడొద్దని మ్యాక్స్ జాయ్ వారికి సూచించాడు.తీవ్ర ఆవేశానికి లోనైన మహిళ సహా ఐదుగురు వ్యక్తులు మ్యాక్స్ జాయ్‌తో గొడవకు దిగారు. 'బ్లడీ బ్లాక్ ఇండియన్స్' అంటూ అతడిపై నోరు పారేసుకున్నారు. రెస్టారెంట్లో ఉన్న మరికొందరు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే దుండగులు మ్యాక్స్‌ను తీవ్రంగా గాయపరిచి పారిపోయారు.  


indian-driver

తీవ్రగాయాలైన జాయ్ రాయల్ హార్బట్ దవాఖానలో చేరారు. చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదుచేశారు. చాలామంది డ్రైవర్లు ఇలాంటి వేధింపులకు గురవుతున్నా ఎవరూ పోలీసులకు ఫిర్యాదుచేయడంలేదని జాయ్ తెలిపాడు. విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ జోక్యం చేసుకుని దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని కోరాడు. . తనకు న్యాయం చేసేందుకు పోలీసులుగానీ, అధికారలు గానీ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించాడు. కొట్టాయం ఎంపీ జోస్ కె మణి ఈ జాతి విద్వేష దాడిని తీవ్రంగా ఖండించారు. విదేశాంగ మంత్రిని కలుసుకుని సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: