సాధారణంగా మనకు టీ తాగాలనిపిస్తే ఎక్కడికి వెళ్తాం. ఇంట్లో ఉంటే, మనకు టీ చేసుకోవడం వస్తే గనుక చేసుకొని తాగుతాం. మనం బయట ఉంటే..? అప్పుడేం చేస్తాం..? బయట టీ స్టాల్ కి వెళ్లి టీ తాగుతాం. కాఫీ తాగాలనిపిస్తే కాఫీ తాగుతాం. కానీ డబ్బులు ఎక్కువగా ఉంటే ఏం చేస్తాం. హోటల్ కి వెళ్లి తాగుతాం. ఎవరైనా గెస్ట్ గానీ, దగ్గరి స్నేహితుడు కానీ కలిశాడనుకుంటే ఏం చేస్తాం.


Image result for cockroaches in fridge

కాస్త డబ్బు ఎక్కువైనా పరవాలేదు కానీ మంచి కాస్ట్లీ టీగాని, కాఫీ గాని వారికి తాగించాలనుకొని కాఫీ డే తీసుకెళ్లి మంచి కాఫీ ఆర్డర్ ఇస్తాం. రాజస్థాన్‌ రాజధాని జయపురలో కాఫీ తాగేందుకు నిఖిల్‌ ఆనంద్‌ సింగ్‌, అర్పణ్‌ వర్మ అనే ఇద్దరు స్నేహితులు కాఫీ డేకు వెళ్లారు. కాఫీ ఆర్డర్ ఇచ్చిన సందర్భంగా అక్కడే ఉన్న ఫ్రిడ్జ్ లోని బొద్దింకల గుంపును చూసి విస్తుపోయారు.


Related image

ఏంటి ఫ్రిడ్జ్ లో బొద్దింకలు ఉన్నాయని, దాని వల్ల ఆరోగ్యానికి హానికరం కదా.. అని ప్రశ్నిస్తే.. దానికి కోపగించుకున్న ఆ హోటల్ మహిళా సిబ్బంది ఆగ్రహంతో వచ్చి అతని చెంపపై లాగి ఒక్కటిచ్చింది. దీంతో బాధితులు దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది వైరల్ కావడంతో స్పదించిన హోటల్ యాజమాన్యం ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: