పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మేలను ఉద్దేశించిన ఒక పోస్ట్ సోషల్ మీడియా లో హల్  చల్ చేస్తుంది. పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారిన ఎమ్మెల్యే లంతా వ్యభిచారులు,వాళ్లను చేర్చుకునేది ఆ వ్యభిచార కొంపలు నడిపే యజమానులు.. అని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉన్న ఈ పోస్ట్ రేవంత్ రెడ్డి కి సంబంధించింది. అయితే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నే దృష్టిలో పెట్టుకొనే అంత మాట న్నాడా..?


Image result for chandrababu revanth reddy

అంటే అవుననే అమాధానమే ఇక్కవ విస్పష్టం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీడీపీ నుంచే టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు ఎక్కువైనాయి. ఈ కారణంతోనే రేవంత్ రెడ్డి ఇలా ఘాటు వ్యాఖ్యలు చేశారని ఇక్కడ స్పష్టంగా అర్థం అవుతోంది. అయితే తెలంగాణ లోలాగా పార్టీ ఫిరాయింపులు ఆంధ్రా లో కూడా జరిగాయి కదా..? మరి రేవంత్ బాబును అన్నాడని ఎందుకు అనుకోకూడదు. ఈ పోస్ట్ రేవంత్ బాబు ను కూడా అన్నట్టు గానే ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


Image result for chandrababu revanth reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైకాపా నుంచి పచ్చ పార్టీలోకి భారీగా వలసలు జరిగాయి. అప్పుడు చంద్రబాబు కూడా రాజీనామా చేయించకుండానే వైకాపా నేతలను పచ్చ పార్టీలోకి తీసుకున్నారు. ఈ లెక్క ప్రకారం చూస్తే రేవంత్ రెడ్డి బాబు ను కూడా విమర్శించినట్టే లెక్క అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా లో పోస్ట్ వేసిన తర్వాత అది కేసీఆర్ కి వర్తిస్తుందా, లేక బాబుకు వర్తిస్తుందా చెప్పి పోస్ట్ చేస్తే ప్రజలకు ఇంకా బాగా అర్థం అయ్యేది.


మరింత సమాచారం తెలుసుకోండి: