నటుడు బాలకృష్ణ మరో వివాదంలో ఇరుక్కున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి, రాణి రుద్రమదేవి సినిమాలకు వినోదపన్ను మినహాయించడంపై పూర్తి వివరాలు సమర్పించాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. పన్ను మినహాయించినప్పుడు.. దానికి సంబంధించిన ప్రయోజనాలను ప్రేక్షకులకు ఎందుకు ఇవ్వలేదో తెలపాలని స్పష్టం చేసింది.


రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ నటుడు బాలకృష్ణతో పాటు శాతకర్ణి చిత్ర నిర్మాత రాజీవ్ రెడ్డి, రుద్రమదేవి దర్శక నిర్మాత గుణశేఖర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 
ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వినోదపన్ను మినహాయింపు ఇస్తూ.. ప్రేక్షకులకు టికెట్ ధరలో రాయితీ వంటి ప్రయోజనాలు ఇవ్వలేదంటూ సినీ ప్రేక్షకుల 
వినియోగదారుల సంఘం కార్యదర్శి వేణుగోపాల్ రావు హైకోర్టును ఆశ్రయించారు. 

RUDRAMADEVI కోసం చిత్ర ఫలితం
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్ లతో కూడిన ధర్మాసనం.. వ్యాజ్యంలో నటుడు బాలకృష్ణను ఎందుకు ప్రతివాదిగా చేర్చారని అడిగింది. బాలకృష్ణ ప్రభుత్వాలను ప్రభావితం చేశారని... పన్ను మినహాయింపు ద్వారా వచ్చిన సొమ్మును నిర్మాతతో పాటు కథానాయకులు పంచుకుంటారని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. 



స్పందించిన న్యాయస్థానం బాలకృష్ణ, నిర్మాత, ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపు 
తిరుగుతుందో  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: