‘ఎల్లమ్మ గుడిలో ఎమ్మెల్యే కబ్జా’ శీర్షికన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గుడిని కబ్జా చేసిన తీరును ఈనెల 20న మీడియా ఎండగట్టిన విషయం తెలిసిందే. కొమురవెల్లిలో మల్లన్న మూల విరాట్‌ను తొలగించి గ్రానైట్‌ విగ్రహం పెడతానంటూ ముత్తిరెడ్డి చేసిన ప్రకటనలనూ మీడియా వెలుగులోకి తెచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతల సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఆ కథనాలను ప్రస్తావించారు. కేసీఆర్ ఇద్దరు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.



జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కొమురవెల్లి మల్లన్న గుడిలో మూలవిరాట్ విగ్రహం మట్టిది ఉందని, దానిని తొలగించి, గ్రానైట్ మూలవిరాట్ విగ్రహం పెడతానని ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడుతానని ఆయన గతంలో పేర్కొన్నారు. దీనిపై తనను కలిసిన ముత్తిరెడ్డిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. . యాదగిరి రెడ్డి వైఖరిని తప్పుబట్టారు. ఆ రిజిస్ట్రేషన్లు చేయించుకునుడేంది? ఆ చెరువుల జోలికి పోవుడేంది అని అసహనం వ్యక్తం చేశారు. ‘‘నీకు సంబంధం లేని విషయాల జోలికెందుకు పోతున్నవు!? ఎవడన్నా.. గుళ్ల తెర్వుకి పోతరా..! అసలు నీకు ఏం తెలుసని పోతున్నవు..? చేయడానికి పనులే లేనట్లు గుళ్ల ఎంబడి ఎందుకు పడుతున్నవు!? అని మండి పడ్డారు. 


Image result for putta madhu

ఈ సందర్భంగా మంథని నియోకవర్గ ఎమ్మెల్యే పుట్టా మధు గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పుట్ట మధు కూడా తన దగ్గరికి ఎవరైనా వెళ్తే కసురుకుంటున్నాడు. నీ దగ్గరికి వచ్చినోళ్లందరికీ పని చేస్తవా.. చెయ్యవా అన్నది కాదు.. మంచిగ మాట్లాడితే ఏంబోతది? ఎమ్మెల్యేకాంగనే గర్వం, కోపం వస్తే ఎట్లా? అందుకే పుట్ట మధుకు నియోజకవర్గంలో మైనస్‌ అవుతోంది’’ అంటూ ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: