నాకది ఉంటే రాజధాని చిత్తూరులో ఉండేది...


తనకు స్వార్ధమే ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిని సొంత జిల్లా చిత్తూరులోనే నిర్మించేవాడినని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తాను నిస్వార్ధంగా ప్రజలకు సేవ 
చేస్తున్నానని చెప్పారు. బుధవారం ఉగాధి పర్వదినాన అవరావతిలో రూ.915కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన ఏడు ప్రధాన రహదారుల నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

ఎమ్మెల్యే..నీవు మనిషివేనా?: కేసీఆర్


ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కొమురవెల్లిలో మల్లన్న మూల విరాట్ ను తొలగించి దాని స్థానంలో గ్రానైట్ తో విగ్రహం 
పెట్టిస్తానని ఇటీవల ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం సీరియర్ అయ్యారు. ‘ఏం మనిషివయ్యా నువ్వు..ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? గుళ్ల తెర్వుకెందుకు పోతున్నవయ్యా?’ అంటూ ముత్తిరెడ్డిపై కేసీఆర్ సీరియస్ అయినట్లు ‘ఆంధ్రజ్యోతి’ పేర్కొంది.


ఇంద్రకీలాద్రిపై ఉగాది వేడుకలు

ఇంద్రకీలాద్రిపై ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి తొలిసారిగా కోటి పుష్పార్చన కార్యక్రమం చేపట్టారు. వసంతమాస ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల పుష్పాలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై పంచాంగ శ్రవణం చేశారు. ఉగాది సందర్భంగా అమ్మవారిని దర్శంచుకోవడానికి ఇంద్రకీలాద్రికి భక్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


గాంధీలో అరుదైన శ‌స్త్ర‌చికిత్స‌...

గాంధీ ఆస్ప‌త్రిలో అరుదైన శ‌స్త్ర‌ చికిత్స ఒక‌టి జ‌రిగింది. విజిల్ మింగిన 10 సంవ‌త్స‌రాల బాలుడుకి గాంధీ వైద్యులు ఇవాళ శ‌స్త్ర చికిత్స చేశారు. కొన్ని రోజులుగా.... బాలుడు నోటి నుంచి వింత‌వింత శబ్ధాలు వ‌స్తూంటే వారి త‌ల్లిదండ్రులు భ‌య‌ప‌డి విజిల్ గురించి తెలియ‌క అన్ని ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు తిప్పారు. ఈరోజు గాంధీ ఆస్ప‌త్రిలో ఈఎస్‌టీ విభాగంలో బాలుడి ఊపిరితిత్తులో విజిల్ ను వైద్యులు గుర్తించారు . అనంత‌రం 2 గంట‌ల పాటు ఆ బాలుడికి శ‌స్త్ర చికిత్స చేసి శ్ర‌మించి విజిల్‌ను వైద్యులు బ‌య‌ట‌కు తీశారు. 


డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో ఖమ్మం ఫస్ట్!


డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సొంత నియోజకవర్గంలోని మద్దులపల్లి గ్రామంలో 22 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ప్రతి పదిరోజులకు ఒక కాలనీ ప్రారంభించే విధంగా పనులు వేగవంతం చేశామన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: