telugu media కోసం చిత్ర ఫలితం 


ప్రజలే ప్రతిపక్షమయ్యే వరకు ఆ ఇద్దరు చంద్రులూ అదృష్టవంతులే ఆంధ్రప్రదేశ్ లో "సమాచార ప్రసార మాధ్యమం (మీడియా)" లో సింహభాగం మరియు "తెలుగుదేశం ప్రభుత్వం" ఒక బండి కి జోడెడ్ల లాగా కలసి మెలసి ముందుకు సాగటం దాదాపు తెలుగుదేశం ఆవిర్భావం నుండే జరుగుతూ వస్తుంది.


నందమూరి తారక రామారావు నాదేళ్ళ దెబ్బనుండి బయట బడటానికి ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు అధికారములోకి రావటానికి ఎన్.టి.ఆర్ రాజకీయంగా వ్యక్తిగతంగా పతనమవ్వటానికి  తెలుగువారు అత్యధికంగా ఆదరించే దినపత్రిక ఈనాడు ప్రధాన కారణం అనేది జగమెరిగిన సత్యం.  తెలుగు పసిబాలుణ్ణి అడిగినా రెండో ఆలోచన లేకుండా ఇదే చెపుతారు. అలాంటి మాధ్యమం ఇప్పుడు కూడా చంద్రబాబుకు నిర్ద్వందంగా బాసటగా నడుస్తుందనటము లో ఎలాంటి సందేహం లేదు.



telugu media కోసం చిత్ర ఫలితం


అగ్నికి ఆజ్యం పోసినట్లు టిడిపి ప్రభుత్వ 100%  వ్యతిరేక పతిపక్షం వైసిపి, వారి స్వంత మాధ్యమం సాక్షి - వైసిపి & సాక్షి రెండింటి పై వ్యతిరేఖను రగల్చటానికి మరియు విషయాలను విస్తృతపరచి సంచలనంగా వార్తలు అందించ గలగటానికి దమ్మున్న మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి తోడైంది. ఈనాడు,  ఆంధ్రజ్యోతి పత్రికలు ఎడ్డెమంటే - సాక్షి తెడ్డే మనే వాతా వరణం సమాచారాన్ని కలుషితం చేయటం జరుగుతుంది.


అలాగే ప్రతిపక్ష నాయకుడు కూడా ఇప్పటికే కొన్ని అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉంటూ - మరికొన్ని కేసుల్లో అవినీతి కేసుల్లో శిక్ష అనుభవించి ఉన్నారు. ఈయనపై కోర్టుల్లో కేసులు మాత్రమే కాక ఎన్-ఫోర్స్మెంట్ డైరెక్ట రేటు లో కూడా అనేక నెరారోపణలతో ముందున్నారు. కొన్నికేసుల్లో  ఆస్తుల స్వాదీనమై ఉండగా, మరి కొన్నిటి లో స్వాదీనం అయ్యే దశలో ఉన్నాయి. వీటిపై ఆంధ్రజ్యోతి మినిట్ టు మినిట్ సమాచారం సంచలనం ఇస్తుండగా ఈనాడు మాత్రం సమాచార మాత్రంగా వార్తలు రాయటం చూస్తున్నాం.


telangana telugu media కోసం చిత్ర ఫలితం


ఇకపోతే అంధ్రప్రదేశ్ లో ముద్రణ దృశ్యమాద్యమాలన్నీ సాక్షి గ్రూప్ తప్ప తెలుగుదేశం ఇంటికాపలా కుక్క లనే చెప్ప వచ్చు. కొన్ని మాద్యమాలు తొలినుంచి తెలుగుదేశం అనుకూలవైఖరి అవలంభించగా మరికొన్నిటి ని నయాన్నో భాయా న్నో వివక్షను ఎరచూపో కొన్ని అవకాశాలను ఏరచూపో మొత్తం మాద్యమాన్ని తన కను చూపు మేరల్లో పనిచేసేలా చెసు కున్నారు ముఖ్యమంత్రి.


ఎవరికీ లొంగని కొమ్మినెని శ్రీనివాసరావు, ఏబికే ప్రసాద్, రామచంద్రమూర్తి  లాంటివాళ్ళు టిడిపి, ముఖ్యమంత్రి వ్యతిరెఖ మాధ్యమం లో ఉంటూ  న్యాయంగా వార్తల నంది స్తున్నారు. అయితే వీరి ప్రభావం అలోచానాపరులను ఉద్వేగానికి గురి చేస్తూనే ఉంది. అంటే వీరు "తిమిరంలో కొంత వెలుగు" నిస్తున్నారన్న మాట.


telangana telugu media కోసం చిత్ర ఫలితం



అయితే సోషల్ మీడియా ప్రజలకు వార్తావిశేషాలు "బెట్వీన్ ది లైన్స్, బెహైండ్ ది లైన్స్, సర్కాస్టిక్, కామెడీ" పద్దతుల్లో రాజకీయనాయకులను తూర్పార బడుతూనే ఉంది.   ప్రసారమాధ్యమాలే తెలుగుదేశానికి, పెట్టని కోట. కొండంత అండ. ఎన్ని పాపాలు చేసినా అవి అన్నీ వార్తలను ప్రభుత్వానికి అనుకూలంగా రాస్తాయి.


కొన్ని విషయాల్లో నిశ్శబ్ధత, కొన్ని విషయాల్లో స్థబ్దత, కొన్నివిషయాల్లో మౌనం పాటిస్తాయి. ఇక్కడ ప్రజలు కాదు ప్రమాణం వీరికి. కులం ప్రధానం బాబు ప్రదానం. మూడొం తులు శాసనసభ్యులను గోడ దూకించి అందులో కొందరికి మంత్రి పదవులిచ్చిన ప్రజాస్వామ్య పాప ఫంఖిలం పచ్చ మీడియాకు ఖచ్చితంగా అంటుకొంటుంది. అప్పుడు సానుభూతి దొరకటం అనుమానమే. తెలంగాణా రాష్ట్ర సమితికి అసలు మీడియాలో ఎదురెలేదు. మీడియా అంతా ఆ నాయకునికి బాకానే. ఇక వారందరికి మొగుడు సోషల్ మీడియానే.


telangana telugu media కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: