తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు.. ఇటీవల కేటీఆర్ మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌లోకి వస్తారనే వార్తలను ఖండించారు. అలాగే జీవన్ రెడ్డి కేసీఆర్ పై పోటీ చేయడం వల్లే గతంలో మంత్రి అయ్యారని కేటీఆర్ కామెంట్ చేయడంపైనా జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను పాతర వేయాలని కేటీఆర్ కామెంట్ చేయడంపైనా జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. 


కేటీఆర్ తన స్థాయిని మరచి అహంకారంతో విమర్శలు  చేస్తున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్‌ను ప్రమోట్‌ చేసేందుకే టీఆర్‌ఎస్‌ జనహిత పేరిట బహిరంగ సభలు నిర్వహిస్తోందని విమర్శించారు. కేసీఆర్‌పై పోటీ చేసి.. నేను మంత్రినయ్యానంటున్న కేటీఆర్‌.. నా చరిత్ర ఏమిటో తన తండ్రిని అడిగి తెలుసుకోవాలని .. గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. 

Image result for t jeevan reddy
అసలు హరీశ్ రావు కాంగ్రెస్ లోకి వస్తారన్న అనుమానం కేటీఆర్ కు ఎందుకు కలిగిందని లాజిక్ పాయింట్ లాగారు సీనియర్ నేత జీవన్ రెడ్డి. కేటీఆర్ కు ఆ అనుమానం వచ్చిందంటే దాని వెనుక ఏదో అర్థం ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో అనేక మంది నాయకులున్నారని, కొత్త వారిని తెచ్చుకోవాల్సిన అవసరం లేదనిజీవన్ రెడ్డి అన్నారు. 

Related image
తెలంగాణలో కాంగ్రెస్ ను పాతర వేయమంటూ కేటీఆర్ పిలుపు ఇవ్వడంపైనా జీవన్ రెడ్డి స్పందించారు. 2014లో కేసీఆర్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకొనే ఎంపీ అయ్యారని ఆయన కేటీఆర్ కు గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చినందుకే కాంగ్రెస్ పాతర వేస్తామని అంటున్నారా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో తాము అధికార పార్టీ సభ్యులుగా ఉండి కూడా ఉద్యమంలో పాల్గొని జైళ్లకు వెళ్లామని గుర్తు చేశారు జీవన్ రెడ్డి. 



మరింత సమాచారం తెలుసుకోండి: