సోషల్ మీడియాలో (సామాజిక మాధ్యమాల్లో) తమపై, తమ పుత్రునిపై తమ ప్రభుత్వంపై జరుగుతున్న సెటైర్లు తో కూడిన విషప్రచారం పై ఉక్కు పాదం మోపుతామని ప్రకటించిన తెలుగుదేశం ప్రభుత్వం ప్రస్తుతానికి కొరడా ఝుళిపించింది. వ్యంగ్యొక్తులు వేసినందుకు సోషల్‌ మీడియా వాలెంటీర్‌ ఇంటూరి రవికిరణ్‌ అనే వ్యక్తి ని తుళ్లూరు పోలీసులు శంషాబాద్‌ లో అరెస్ట్‌ చేశారు.

"పొలిటిక్‌ పంచ్‌" పేరుతో పొలిటికల్‌ సెటైర్లు వేస్తున్న రవికిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున       3 గంటల 30 నిముషాల సమయములో పోలీసులు అరెస్ట్‌ చేశారని, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదని, కాగా అరెస్ట్‌ పై తుళ్ళూరు   పోలీసులు రవికిరణ్‌ కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని,  అతని భార్య సుజన ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారనేది సమాచారం.


సోషల్ మీడియతో పాటు అనేక వెబ్‌-సైట్ల‌ పై ప్ర‌ధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. లో తమ పార్టీ, తమ ప్రభుత్వం, తమ కుమారుని పై జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయటానికి చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న సమాచారం తెలిసిందే. అందులో భాగంగా సోష‌ల్ నెట్‌వ‌ర్క్‌లో వ్యతిరెఖ ప్రచారం (నెగిటివ్ క్యాంపెయిన్‌) పై చ‌ట్ట‌ప్ర‌కారం చర్యలు తీసుకోవటానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉపక్రమించినట్లు రూఢీగా నిర్దారణ అయిందంటున్నారు.



సోషల్‌ మీడియాపై నియంత్రణ తెచ్చేందుకు ఒక ప్రత్యేకం చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. సోష‌ల్ మీడియా ద్వారా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్ర‌చారం చేస్తున్న వారి పై చట్టపరంగా చర్యలు తీసుకునే అంశాల్ని పరిశీలిస్తోంది అనేది సమాచారమైతే దానిపై చర్య రవికిరణ్ తో ప్రారంభించటం యధార్ధం. ఫేస్‌-బుక్‌ లోని పేజీలు, వెబ్‌-సైట్ల‌ పై ప్ర‌ధానం గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 


ఈ రవి కిరణ్‌ అనే వ్యక్తి  శాసనమండలిని అవమానం కలిగేలా కార్టూన్‌ వేయడంతో అసెంబ్లీ కార్యదర్శి సత్యన్నారాయణ తుళ్లూరు పోలీస్‌-స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయటంతో వారు విచారణ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది.  వైసీపీ నేతల మంటూ అసెంబ్లీ కార్యదర్శికి ఫోన్‌ చేసి ఆయనను బెదిరింపులకు కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. చట్టసభలను కించపరిస్తే ఎవరిపై నైనా చర్య తీసుకుంటామని అసెంబ్లీ కార్యదర్శి సత్యన్నారాయణ స్పష్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: