సోషల్ మీడియాపై చంద్రబాబు సర్కారు కఠినంగా వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటివరకూ సోషల్ మీడియాపై ఇలాంటి చర్యలకు తెలుగు రాష్ట్రాల్లో చర్యలు తీసుకోలేదు. గతంలో ఓ సెటైర్ ప్రోగ్రామ్ ద్వారా తెలంగాణ నాయకులను కించపరిచారన్న కారణంతో కేసీఆర్ టీమ్ టీవీ9, ఏబీఎన్ ఛానళ్లను అనధికారికంగా బ్యాన్ చేసింది.


అప్పట్లోనూ ఆ వ్యవహారం బాగా చర్చనీయాంశంమైంది. ప్రస్తుతం ఇంటూరి రవికిరణ్ అరెస్ట్ ద్వారా అడ్డగోలు ప్రచారం చేస్తే ఊరుకోబోమనే సంకేతాలు పంపించాలని తెలుగు దేశం సర్కారు పంపిస్తోంది. ఐతే సోషల్ మీడియాలో దుష్ప్రచారం అన్నది కొత్తగా వచ్చిన విషయమేమీ కాదు. కొన్నేళ్లుగా ఇది సాగుతున్నదే. ఇలాంటి ప్రచారం పసుపు దళాలు కూడా చేశాయి. చేస్తున్నాయి కూడా. 


సోషల్ మీడియాలో దుష్ప్రచారం అన్నది అన్ని పార్టీలపైనా జరుగుతోంది.. అన్ని పార్టీలూ ఇతర పార్టీలపై చేస్తున్నాయి కూడా. అంతేకాదు.. కించపరిచేలా ఉన్నవి కేవలం సోషల్ మీడియాలోనే కాదు.. రెగ్యులర్ మీడియాలోనూ ఎన్నో కార్టూన్లు వస్తుంటాయి. వాటిలోనూ చాలా వ్యంగ్యం ఉంటుంది. మరి అలాంటి కార్టూనిస్టులను కూడా అరెస్టు చేస్తారా..?

Image result for social media icons

సోషల్ మీడియా ప్రచారం ఎప్పటి నుంచో ఉన్నా.. ఇప్పుడే చర్యలు ఎందుకు తీసుకుంటున్నారన్న ప్రశ్నఉదయిస్తోంది. అయితే ఇటీవల లోకేశ్ మంత్రి కావడం.. ఆయన ప్రమాణస్వీకారం, అంబేద్కర్ వర్థంతిని జయంతి అనడం.. వంటి ఘటనలపై సోషల్ మీడియాలో విపరీతమైన జోకులు పేలాయి. ఈ వ్యవహారంతోనే అధికార పార్టీ కోపం పతాకస్థాయికి చేరి చివరకు రవికిరణ్ అరెస్టుకు దారి తీసి ఉంటుందన్నది ఓ విశ్లేషణ. 



మరింత సమాచారం తెలుసుకోండి: