ప్రపంచంలో చాలా మందికి కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి..అవి చూస్తే చాలా మందికి విడ్డూరంగా ఉన్నా వాళ్లకు అది కామన్.  కొంత మంది గాజు ముక్కలు తింటుంటారు..కొంత మంది మట్టి తిన బతుకుతారు..మరొకొంత మంది నీళ్లు తాగుతూ బతుకుతున్నాం అంటారు..ఇలా ప్రపంచంలో రక రకాల ఆహారపు అలవాట్లు చాలా కాలంగా ఉన్నా వారికి మాత్రం ఎలాంటి అనారోగ్యం ఉండకపోవడం విశేషం.  తాజాగా ఓ వ్యక్తి దాదాపు 25 సంవత్సరాలుగా కేవలం ఆకులు, బెరడ్లు తింటూ కాలం వెల్లబుచ్చుతున్నాడు.

వివరాల్లోకి వెళితే..పాకిస్థాన్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని గుజ్రన్‌వాలా జిల్లాకు చెందిన మెహమూద్ అనే వ్యక్తి గత 25 సంవత్సరాలుగా కేవలం చెట్ల ఆకులు, బెరడులు తింటున్నాన‌ని చెబుతున్నాడు. అయితే తాను చాలా పేదవాడిని అని అయినా ఎవ్వరి ముందు చేయి చాచి అడగాల్సిన పని లేకుండా ఆకులు తింటూ కాలం వెల్లబుచ్చుతున్నానని అంటున్నాడు.  

అయితే ఈ మద్య కాలంలో మంచి పని దొరికిందని కాస్త డబ్బులు కూడా సంపాదిస్తున్నానని కానీ తనకు మాత్రం ఆకులు తినడంలో ఉన్నతృప్తి వేరే ఏం తిన్నా కలగడం లేదని అంటున్నాడు. ఆయ‌న ఇటువంటి ఆహారం తింటున్న‌ప్ప‌టికీ ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురికావ‌డం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: