తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన బాహుబలి సీక్వెల్ బాహుబలి 2 ..ఈ నెల 28 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.  అయితే ఈ సినిమాపై మొన్నటి వరకు కన్నడీలు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే.  ఒకదశలో బాహుబలి 2 చిత్రాన్ని కర్ణాటకలో ఆడనివ్వం అని అని గట్టిగా తేల్చి చెప్పారు.  అయితే గతంలో బాహుబలి చిత్రంలో నటించిన కట్టప్ప(సత్యరాజ్) కావేరీ జలాల విషయంలో కన్నడ చిత్రరంగంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వారి ఆరోపణ.  
Image result for baahubali 2
దీంతో రంగంలోకి దిగిన దర్శకులు రాజమౌళి ఈ చిత్రం ఏ ఒక్కరికో సంబంధించినది  కాదని ఈ సినిమా గురించి ఎంతో మంది కష్టపడ్డారని దయచేసి సినిమా విషయంలో అడ్డంకులు చెప్పొద్దని విన్నవించుకున్నారు.  కానీ కన్నడీలు మాత్రం పట్ట బిగించే ఉండటంతో తన ఒక్కడి గురించి బాహుబలి లాంటి గొప్ప సినిమా ఇబ్బందులు పడవద్దని సత్యరాజ్ నిన్న కన్నడీలకు క్షమాపణలు చెప్పారు.  ఆయనతో క్షమాపణలు చెప్పించేంత వరకూ వదలని కన్నడిగులు పట్టుబట్టి పంతం నెగ్గించుకోగా, ఇప్పుడు గొడవలు తమిళనాడుకు పాకాయి.
Related image
తమ నటులను పదేపదే అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ తమిళ సంఘాలు కన్నడ చిత్రాల ప్రదర్శనను అడ్డుకున్నాయి. తాజాగా విడుదలైన కన్నడ చిత్రాలను ప్రదర్శిస్తున్న పలు థియేటర్ల వద్దకు వచ్చిన తంబీలు, బలవంతంగా చిత్ర ప్రదర్శనను ఆపివేయించారు.  అంతే కాదు గత కొంత కాలంగా తమిళ సినిమాపై ఇలాంటి ఆక్షేపణలు పెడుతున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని కలవనున్నట్టు ఫిలిం చాంబర్ నేతలు ఈ సందర్భంగా ప్రకటించారు. ఇక ఈ వివాదం ఎంతవరకూ వెళుతుందన్నది ఆందోళన కలిగిస్తోందని సినీ పరిశ్రమ నిపుణులు వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: