జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డారు. రాబోయే ఎన్నికల్లో పవన్ బీజేపీ తో కలిసి పోటీ చేసే అవకాశం ఎంత మాత్రం లేదని పవన్ ట్వీట్ స్పష్టం చేస్తుంది. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అన్నీ దాదాపుగా హిందీ లోనే తమ సంభాషణను జరిపేవి. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం అందుకు పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఇటీవల మోడీ మంత్రులందరినీ హిందీలోనే మాట్లాడాలని ఆదేశాలు జారీ చేయడమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.



మన దేశం ప్రజాస్వామ్య గణతంత్ర దేశం ఇందులో ఎన్నో మతాల, కులాల, భాషల సమ్మేళనాలు కలిసే ఉన్నాయి. అంటే ఏ ప్రాంతానికి సంబంధించిన వారు ఆ ప్రాంతం భాషను మాట్లాడుకోవచ్చు. అంతెందుకు పార్లమెంట్ లో కూడా ప్రాంతాయ భాషలు మాట్లాడిన నాయకులు ఎందరో. కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధంగా కేవలం ఒకే భాషను ప్రోత్సహించడం అనేది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం అనే చెప్పవచ్చు.



ఈ విశానం వల్ల మళ్లీ మన దేశంలో ప్రాంతీయ భాషా ఉద్యమం ప్రారంభం అయ్యే అవకాశం లేకపోలేదు.  సంస్కృతి, భాషలకు, భిన్న జాతులకు మారుపేరైన మన దేశం లో సబ్-నేషనల్ ఐడెంటిటీ అంశాన్ని కనుక కేంద్ర ప్రభుత్వం గౌరవించకపోతే.. వేర్పాటు వాద ఉద్యమాల ఆవిర్భావానికి ఆస్కారం కల్గించినట్టు అవుతుందని పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: