సోషల్ మీడియాలో పార్టీల పోరాటం కొత్త విషయం కాదు. కానీ లోకేశ్ పై పోస్ట్ పెట్టినందుకు ఇంటూరి రవికిరణ్ ను అరెస్ట్ చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియా వార్ పై చర్చ మొదలైంది. రవికిరణ్ అరెస్టు తర్వాత టీడీపీ నాయకులు అంతా సోషల్ మీడియాలో అలా దుష్ప్రచారం చేయడం అంత అనైతికమో ఏకరువు పెడుతున్నారు. సోషల్ మీడియా కట్టడిపై లెక్చర్లు దంచుతున్నారు. 



కానీ ఇదే టీడీపీ సోషల్ మీడియా చేసిన అరాచకాల సంగతేంటన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. తెలుగుదేశం పార్టీ అనుబంధ వర్గాలు.. విపక్ష నేత జగన్ పైన, మరణించిన ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డిపైనా వందల కొద్దీ పోస్టులు పెట్టిన సంగతి మాత్రం మరచిపోతున్నారు.



నోట్ల రద్దుతో జగన్ ఆస్పత్రి పాలైనట్లు, ఆయన కుటుంబ సభ్యులు అక్కడ నిలబడి చూస్తున్నట్లు దారుణమైన ప్రచారం చేసిన పోస్టులు కోకొల్లలు.



జగన్ ను దొంగగా, దోపిడీదారుగా, పనికిరాని వాడుగా ఇలా ఎన్నో సినిమా క్యారక్టర్లకు మార్ఫింగ్ చేసిన పోస్టులు ఫేస్ బుక్ లో కోకొల్లరు.. పొలిటికల్ హంట్, బ్యాన్ బ్లాక్ మీడియా ఇలా అనేక పేజీల్లో జగన్ ను ఆయన కుటుంబాన్ని తిట్టే పోస్టులు లక్షల కొద్దీ ఉన్నాయి.




మరి వాటి సంగతి ఏంటి.. మరి ఇలాంటి చెత్త ప్రచారం చేసిన వారిపై చర్యలు ఉండవా.. ఇప్పుడు ఈ ప్రశ్నలు సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి ఎదురవుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: