హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు శిరీష్ కర్నాటకలో వీరంగం సృష్టించాడు. బెంగళూరు నుంచి తన స్వగ్రామం గోరంట్లకు వస్తున్న సమయంలో అంబరీష్‌ బాగేపల్లి టోల్‌గేట్‌ వద్దకు చేరుకున్నాడు. టోల్ గేట్ దగ్గర ఫీజు చెల్లించమని అడిగినందుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతే తాను ఎంపీ కొడుకును అని  మినహాయింపు ఇవ్వాలని వారితో గొడవకు దిగారు. రూల్స్ కి విరుద్దంగా తాము చేయం అనడంతో  తన స్నేహితులతో కలిసి సిబ్బందిపై దాడి చేశారు.  ఏపీ- కర్ణాటక సరిహద్దుల్లోని బాగేపల్లి టోల్ గేట్ దగ్గరకు కారులో వచ్చిన అంబరీష్‌, శిరీష్ ను ఫీజు కట్టమని సిబ్బంది అడిగారు. 

 అనుచరులతో చేసిన దాడిలో  కంప్యూటర్లు, ఫర్నీచర్‌ ధ్వంసమయ్యాయి.  ఈ ఘటనలో టోల్ ప్లాజా స్పల్పంగా ధ్వంసమైంది. సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప ఇద్దరు కొడుకులతో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారు. చిక్ బల్లాపూర్ డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.
mp-nimmala-kristappas-son-vandalised
 హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు అంబరీష్ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించిన సీఎం చంద్రబాబు.. సీరియస్ అయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించాలని పోలీసుశాఖను ఆదేశించారు. ఎంతటివారైనా వదిలిపెట్టేదిలేదని సీఎం స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: