పుట్టిన వాడు గిట్టక మానడు.. గిట్టిన వాడు పుట్టక మానడు.. ఇదీ హిందూ ధర్మం చెప్పే నానుడి. చేసిన కర్మఫలం ఆధారంగా పునర్జన్మ ఉంటుందని హిందూ ధర్మం చెబుతోంది. మరి ఈ జన్మలో మనుషులుగా పుట్టిన మనం వచ్చే జన్మలో ఎలా పుడతామో తెలుసుకోవాలని ఉండటం చాలా సహజం. అది తెలుసుకోవాలంటే మనం ఈ జన్మలో చేసిన పాపాలేంటో గుర్తు చేసుకోవాలి. 

HINDU REBIRTH కోసం చిత్ర ఫలితం
ఈ జన్మలో ధాన్యం దొంగిలిస్తే వచ్చే జన్మలో ఎలుకగా, పందికొక్కుగా పుడతారట. ఇంకా ఆ పాపం పోకపోతే అప్పుడు కుక్కలా పుడుతారట.  అన్నను కావాలనే తప్పుబట్టి, నిందించిన తమ్ముడు కొంగలా పుడతాడట. చేసిన మేలును మరచిపోయిన వాడు యమలోకంలో దారుణమైన హింస అనుభవిస్తాడట. డబ్బు విషయంలో నమ్మకద్రోహం చేసినవాడు చేపగా పుడతాడట. 

HINDU REBIRTH కోసం చిత్ర ఫలితం
అన్నం, పాలు, పెరుగు, నేయి దొంగిలిస్తే దోమలు, ఈగలుగా పుడతారట. ఇనుము, వెండి, బంగారాలను దొంగిలిస్తే కోతి, కాకి, గువ్వ, పేడ పురుగల్లా పుడతారట. ఇక భార్య కాకుండా ఇతర స్త్రీలను ఆశించేవాడు తోడేలు, రాబందు, గద్దగా జన్మిస్తాడట. ఈ పాపాలను తగ్గించుకునే మార్గాలు కూడా ఉంటాయట. న్యాయంగా సంపాదించిన సొమ్ముతో దాన ధర్మాలు చేస్తే ఈ పాపాలు తగ్గుతాయట. 

HINDU REBIRTH కోసం చిత్ర ఫలితం
కాబట్టి ఇప్పటి వరకూ మీరు చేసిన తప్పులు గుర్తు తెచ్చుకోండి. ఆ పాప భారం తగ్గించేందుకు దానాలు చేయండి..  తద్వారా వచ్చే జన్మలో మంచి జన్మ పొందండి. ఇవన్నీ యమధర్మరాజుకు బృహస్పతి చెప్పిన జన్మ రహస్యాలు. అందుకే ముందుగానే మేలుకొని పాపభారం తగ్గించుకుంటే మంచిది. ఏమంటారు.



మరింత సమాచారం తెలుసుకోండి: