ఇప్పుడు ఎక్కడ చూసినా బాహుబలి 2 మేనియా కనిపిస్తోంది. మొదటి రోజే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలన్న కుతూహలం లక్షలాది మందిలో ఉరకలు వేస్తోంది. అందుకే ఆన్ లైన్లో సినిమా టికట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మొదటి వారం రోజుల వరకూ టికెట్లన్నీ బుక్ అయిపోతున్నాయి. అంత క్రేజ్ ఉంది మరి. 

bahubali 2 tickets కోసం చిత్ర ఫలితం

సరిగ్గా ఈ క్రేజ్ నే క్యాష్ చేసుకుంటున్నారు కొందరు సైబర్ నేరగాళ్లు. బాహుబలి సినిమాపై ఉన్న అభిమానాన్ని సొమ్ము చేసుకోడానికి వీరు రంగంలోకి దిగారు. www.newtickets.in పేరుతో ఇప్పటికే ఓ నకిలీ ఆన్ లైన్ టికెట్ బుకింగ్ వెబ్ సైట్ అభిమానుల జేబులు ఖాళీ చేసింది. ఈ వెబ్ సైట్ హైదరాబాద్‌తో పాటు దేశంలోని మెట్రోపాలిటిన్‌ నగరాల్లో టికెట్లు ఇస్తామని ఊరిస్తోంది. 

bahubali 2 tickets కోసం చిత్ర ఫలితం

కేవలం ఇండియన్ నగరాలే కాదు.. అమెరికా, ఇంగ్లండు దేశాల్లోనూ కొన్ని సినిమా హాళ్ల టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపించింది. బాహుబలి సినిమా టికెట్లు అవైలబుల్ అని కనిపించగానే పాపం సినిమా అభిమానులు ముందూ వెనుకా చూసుకోకుండా ఆన్ లైన్ లో డబ్బు చెల్లించి టికెట్ బుక్ చేసుకున్నారు. నిజమైన టికెట్ బుకింగ్ వెబ్ సైటు లాగానే దీన్నుంచి కూడా టికెట్ బుక్ కాగానే ఎస్ ఎం ఎస్ కూడా వచ్చేసింది. 

bahubali 2 tickets కోసం చిత్ర ఫలితం

ఐతే.. ఎన్నిసార్లు బుక్ చేసినా ఆ సీట్లు ఖాళీగానే కనిపించడం.. సీట్లు చాలా వరకూ ఖాళీగా కనిపించడంతో అనుమానం వచ్చి ఆరా తీస్తే అది నకిలీ వెబ్ సైట్ అని తేలింది. దీన్ని నకిలీ వెబ్‌సైట్‌గా హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు నిర్దారించారు. ఈ సైట్లో ఒక్కో టిక్కెట్లు రూ.120 వంతున అమ్మారు. ఈ వెబ్‌సైట్‌ సర్వర్‌ దుబాయ్‌లో ఉందట. పేమెంట్ గేట్ వే కోసం పేయూమనీ సంస్థతో ఒప్పందం చేసుకున్నారట. అందుకే బాహుబలి టికెట్లు కొనే ముందు కాస్త జాగ్రత్త. 



మరింత సమాచారం తెలుసుకోండి: