తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్.  ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు పవన్ ని ఎంత గొప్పగా అభిమానిస్తున్నారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’ పార్టీ స్థాపించిన పవన్ కళ్యాన్ తాను మాత్రం ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడిపీ, బిజెపి కి మద్దతు పలికారు..అంతే కాదు ఆ పార్టీల తరుపు నుంచి ప్రచారం కూడా చేశారు.  తర్వాత ఏపీలో రాజధాని భూముల గురించి పోరాటం చేశారు..ఈ మద్య కాలంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు.  
Image result for pawan kalyan modi babu
మరోవైపు పవన్ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై చేస్తున్న విమర్శలకు ఆయనపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బీజెపికి చెందిన కొంత మంది నేతలు పవన్ పై విరుచుకుపడుతున్నారు.  తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మతిస్థిమితం సరిగ్గా లేదని ఘాటు విమర్శలు చేస్తున్నాడు బిజెపి అధికార ప్రతినిధి కృష్ణసాగర్.  సినిమాల్లో రక రకాల వేషాల్లో నటిస్తే..జనం మెచ్చుకుంటారు కాని రాజకీయాల్లో చేస్తే జనం చూస్తూ ఊరుకోరు.  
Image result for pawan kalyan jana sena
అంతే కాదు పవన్ రాజకీయాల్లో నటిస్తే తప్పని అతడి మానసిక పరిస్థితి సరిగా లేనట్లుందని అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడని ,రాజకీయాలంటే సినిమా కాదని ప్రధాని ని విమర్శించేతప్పుడు తగిన ఆధారాలతో విమర్శించాలని హితువు పలికాడు కృష్ణసాగర్.  జాతీయ సమగ్రత బిజెపి తొలి నినాదామని ,ఉత్తరాది , దక్షిణాది అనే తేడాలు బిజెపి కి లేవని చిత్ర విచిత్రంగా ట్వీట్ లు పెడుతూ ప్రజలను కన్ఫ్యూజ్ కి గురి చేయవద్దని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: