భారత దేశంలో యోగాలో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేసి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు బాబా రాందేవ్.    తాజాగా యోగా గురువు, పతంజలి ఉత్పత్తుల అధినేత బాబా రాందేవ్‌పై సామాజిక మాధ్యమాల్లో ప‌లు వ‌దంతులు షికార్లు చేస్తున్నాయి. బాబా రాందేవ్‌ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్టు సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా వదంతులు గుప్పుమన్నాయి.  
baba ramdev accident fake news and photos viral on social media
అంతే కాదు ప్రమాదంలో గాయపడిన ఆయనను స్ట్రెచర్‌ మీద తరలిస్తున్నట్టు ఉన్న ఈ ఫొటోలు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో షేర్‌ అవుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయినట్లు ఇన్ సెట్ లో రాందేవ్ బాబా ఫోటో పెటడంతో అందరూ షాక్ కి గురయ్యారు. అయితే, ఈ కథనాలు, ఫొటోలూ బూటకమని తేలింది.
baba ramdev accident fake news and photos viral on social media
ప్రస్తుతం రాందేవ్‌ బాబా హరిద్వార్‌లో సురక్షితంగా ఉన్నారని సమాచారం. ఫొటోమార్ఫింగ్‌ చేసిన ఫొటోలతో ఎవరో కావాలనే ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో ఈ ప్రచారం చేస్తున్నట్టు ఆయన సన్నిహితులు భావిస్తున్నారు.  అంతే కాదు  తాను క్షేమంగా ఉన్నానంటూ రాందేవ్ బాబా కూడా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

రాందేవ్ బాబా ట్విట్ :



మరింత సమాచారం తెలుసుకోండి: