ఆంగ్లేయ విద్యావిధానం దేశమంతటా నడుస్తున్న సమయంలో ప్రాంతీయ భాషకు పట్టంకడుతూ ఏర్పడిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఉస్మానియా ఇప్పుడు వందేళ్ల పండుగ జరుపుకుంటోంది. ఈ విద్యానందన వనం ఊపిరిపోసుకుని ఓ శతాబ్దం గడిచిపోయింది. ఈ వందేళ్ల ప్రస్థానంలో ఎన్నిమలుపులో.. ఎన్ని మధుర జ్ఞాపకాలో..

OU CENTENARY CELEBRATIONS కోసం చిత్ర ఫలితం
అందుకే వందేళ్ల పండుగను తెలంగాణ సర్కారు ఘనంగా నిర్వహిస్తోంది. ఏకంగా ఓ ఏడాది పొడవునా ఈ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. బుధవారం ప్రారంభంకానున్న ఈ సంబరాల ఆరంభానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రారంభోత్సవానికి హాజరవుతున్నారు. 

OU CENTENARY CELEBRATIONS కోసం చిత్ర ఫలితం
ప్రణబ్ ముఖర్జీ  గోవా నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి, అక్కడి నుంచి నేరుగా ఉస్మానియా వర్సిటీకి చేరుకుంటారు. ఈ శతాబ్ది సంబరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 18 వేల మంది పాల్గొనేందుకు వీలుగా ప్రాంగణాన్ని సెంట్రల్ ఎయిర్ కండిషన్‌తో రెడీ చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, అగ్నిమాపక దళం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు. 

సంబంధిత చిత్రం

ఇందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయపరుస్తున్నారు. సభా వేదిక వద్ద ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేశారు. వేదిక ప్రాంగణంలో కూర్చునేందుకు వీలుగా వీఐపీలకు, మీడియాకు, విద్యాశాఖ అధికారులు, వీసీలు, ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులకు, నాన్ టీచింగ్ ఉద్యోగులకు, దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించారు. పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: