టీడీపీ అంటే క్రమశిక్షణ.. క్రమశిక్షణ అంటే టీడీపీ.. ఇదీ తరచూ పార్టీ సమావేశాల్లో చంద్రబాబు చెప్పే డైలాగ్.. దీంతో పాటు మరో ఊతపదం కూడా వినిపిస్తుంది.. గీత దాటితే ఎవ్వరినీ ఉపేక్షించను.. ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవు.. నాకు మొహమాటం లేదు.. ఇలా సాగిపోతుంటుంది చంద్రబాబు వాగ్దాటి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏ ఒక్కటీ అమలు కాదు. 



ఇటీవలి కాలంలో టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయి. అధికారమదంతో కొందరు నాయకులు కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఒకదాని తర్వాత మరొకటి జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న బెజవాడలో ఓ ఐపీఎస్ అధికారిపైనే టీడీపీ నాయకులు దౌర్జన్యం చేశారు. నడిరోడ్డుపై నిలబెట్టి బూతులు తిట్టినంతపని చేశారు. 

KESINENI NANI ATTACK కోసం చిత్ర ఫలితం

నిన్నటికి నిన్న చిత్తూరు జిల్లాలోని ఇసుక మాఫియా దాదాపు 17 మందిని పొట్టనబెట్టుకుంది. ఈ ఇసుక మాఫియా వెనక టీడీపీ నేతలే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఐనా చర్యలు శూన్యం. ఇక కర్నాటక సరిహద్దులోని బాచెపల్లి టోల్ గేటు వద్ద ఎంపి నిమ్మల కిష్టప్ప తనయుడు చేసిన వీరంగం ఏకంగా సీసీ టీవీలోనే దొరికిపోయి.. రాష్ట్రమంతటా చూశారు.

NIMMALA KISTAPPA SON ATTACK కోసం చిత్ర ఫలితం
ఇలా వరుస ఘటనలు జరుగుతున్నా చంద్రబాబు సర్కారు మాత్రం కిమ్మనడం లేదు. కనీసం ఒక్కరిపైనైనా చర్య తీసుకుని ప్రజల్లో కాస్త నమ్మకం కలిగించేపని చేయడం లేదు. 
ఈ సంఘటనలన్నీ చూస్తుంటే టీడీపీ శ్రేణుల్లో నమ్మకం పెరిగిపోతోంది. మనం అధికారంలో ఉన్నన్నాళ్లూ ఏమైనా చేయొచ్చు.. ఏం చేసినా మనకు ఏమీ కాదు.. అనే ధైర్యం పెరిగిపోతోంది. ఇది రాష్ట్రానికి, టీడీపీకి అంత మంచిది కాదేమో..!



మరింత సమాచారం తెలుసుకోండి: