ఏటా ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తుంటుంది. మరి.. అలాంటి సొమ్ము అనర్హులకు చేరితే ఫలితం ఏముంటుంది.. అందుకే ప్రభుత్వం చేపడుతున్న అభివృధి, సంక్షేమ కార్యక్రమాలు నూటికి నూరు శాతం ప్రజలకు చేరేందుకు టెక్నాలజీని వాడుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. 



ఇప్పుడు ఏపీ సర్కారు కూడా అలాగే చేస్తోంది. ఇందుకు ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజన మైక్రోసాఫ్ట్ సాయం చేస్తోంది. ఏపీ కోసం ప్రత్యేకంగా కైజాలా అనే యాప్ ను తయారు చేసి ఇచ్చింది. తాజాగా ఆ యాప్ పని తీరుపై మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో ఆంధ్రా ఐటీ మంత్రి నారా లోకేశ్ హైదరాబాద్ లో సమావేశం అయ్యారు. 



కైజాలా అప్లికేషన్ ఆధారంగా మైక్రోసాఫ్ట్ తయారు చేసిన అధునాతన సాంకేతికత గురించి లోకేశ్ కు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన, అభివృధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలను నూతన టెక్నాలజితో ప్రజలకు చేరువ చెయ్యడంలో ఏపీ ప్రభుత్వానికి సహకారం అందిస్తామని  మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు తెలిపారు.



ప్రభుత్వం లోని అన్ని శాఖల్లో జరుగుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లడం, అవినీతి రహిత పాలన అందించడం, ప్రజలు నేరుగా తమకు ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి నూతన టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరగా మైక్రోసాఫ్ట్ రియల్ టైం టెక్నాలజీని ప్రభుత్వం లోని అన్ని శాఖలకు అనుసందానం చెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: