భారత ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నో వినూత్న కార్యక్రమాలు చెపడుతున్నారు.  సాధారణ పౌరులకు పెద్ద పీట వేస్తూ దేశంలో అవినీతి నిర్మూలనకు కంకణం కట్టుకున్నారు.  ఇప్పటికే స్వచ్ఛభారత్ తో ఎంతో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు మార్పుకోసం పరితపించేలా చేశారు.  దేశంలో పెరుకు పోతున్న అవినీతి నిర్మూలనకు కోసం పెద్ద నోట్ల రద్దు చేశారు.  ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజలకు చేరువ అయ్యేలా మన్ కీ బాత్ ప్రోగ్రామ్ తో ఆయన మనసులో మాటలు చెబుతూ సామాన్య ప్రజలకు దగ్గరయ్యారు.  
ప్రతి పౌరుడు వీఐపీనే: మన్ కీ బాత్‌లో మోదీ
తాజాగా మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి పౌరుడూ ముఖ్యమనే భావనతోనే వీఐపీల వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. వీఐపీలకంటే సాధారణ పౌరులే ముఖ్యం అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అందుకే వీఐపీ సంస్కృతి స్థానంలో ఈపీఐ(ఎవ్రీ పర్సన్‌ ఇంపార్టెంట్‌) కల్చర్‌ తీసుకొస్తున్నామని తెలిపారు. సెలవుల్లో విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవాలని అన్నారు. ప్రజలు చాలా విషయాలు తన దృష్టికి తీసుకొస్తున్నారని, వారి నుంచి వచ్చిన సలహాలు స్వీకరిస్తానని అన్నారు.
Image result for swachh bharat modi
వాతావరణ మార్పుల అంశంపై ప్రత్యేక సెమినార్లు జరగాల్సిన అవసరం ఉందన్నారు. మన్ కీ బాత్ ద్వారా చిన్నారుల ఆలోచనలు, యువత అభిలాష, పెద్దల ఆలోచనలు తెలుసుకోవాలనుకున్నానని మోదీ తెలిపారు. రేపు గుజరాత్, మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆ రెండు రాష్ట్రాల ప్రజలకు తన అభినందనలు తెలిపారు.  
Image result for new notes
మే 5న భారత్‌ సౌత్‌ ఏసియా వాటిలైట్‌ను ప్రారంభించబోతోందని, అది భారత్‌కు ముఖ్యమైన ముందడుగని దాని ద్వారా మొత్తం సౌత్‌ ఆసియాతో సహాయసహకారాలు పెంపొందించుకోవచ్చిన అన్నారు.స్వచ్ఛ భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మోదీ సూచించారు. డిజిటల్ ఇండియా వల్లే ‘న్యూ ఇండియా’ సాధ్యమేనని చెప్పారు. భీమ్ యాప్ వినియోగంతో సంపాదించే అవకాశం కూడా ఉందని ఆయన గుర్తు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: