ఈ రోజు ఏయూలో ఉత్తరాంధ్ర వెనుకబాటు-ప్రజల ఆకాంక్ష పేరుతో భేటీ జరిగింది. దీనికి సీపీఎం నేత మధు, కొణతాల, లోక్‌సత్తా జయప్రకాష్‌  నారాయణ తదితరులు హాజరయ్యారు. పవన్‌కి కూడా ఆహ్వానం అందింది. కానీ విపరీతమైన పని ఒత్తిడి కారణంగానే  తాను ఈ కార్యక్రమానికి  హాజరుకాలేకపోతున్నానని, జనసేన తరపున దుర్గాప్రసాద్‌ని పంపామని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన ఉత్తరాంధ్ర వెనుకబాబుతనం, ప్రత్యేకహోదాలపై మరలా గళమెత్తాడు. వెనక్కి తగ్గేదిలేదని, మడమ తిప్పేది లేదని ఆయన మరోసారి నొక్కి వక్కాణించారు.  ఉత్తరాంద్రను  పోరాటాలకు పుట్టినిల్లుగా ఆయన పేర్కొన్నారు. ప్రణాళికాబద్దమైన అభివృద్ది లోపం కారణంగానే ఇప్పటికీ ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందన్నారు.  

తాము ఉత్తరాంద్ర అభివృద్ది కోసం పోరాడుతామని చెప్పారు. తొలి ప్రయత్నంగా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను లేవనెత్తామన్నారు. ఉత్తరాంద్ర, రాయలసీమ వంటి వెనకబడిన ప్రాంతాల అభివృద్ది ప్రత్యేకహోదాతోనే సాద్యమవుతుందని పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: