నిజానికి, తెలుగుదేశంతో పొత్తు విష‌య‌మై భాజ‌పా నేత‌లు అంత స‌ముఖంగా ఈ మ‌ధ్య ఉండ‌టం లేదు! తెలంగాణలో టీడీపీ నేత‌ల్ని భాజపా ఎప్పుడో దూరం పెట్టేసింది. ఇక‌, ఆంధ్రాలో భాజ‌పా నేత‌లే తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండాల్సిన ప‌రిస్థితి. రాష్ట్రాల‌ను కాషాయీక‌ర‌ణ చేసేందుకు  భాజ‌పా కంక‌ణ‌బ‌ద్ధ‌మై ఉందన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తెలంగాణ‌, ఆంధ్రాల్లో కూడా ప‌ట్టు బిగించేందుకు సిద్ధ‌మౌతోంది.


అందుకే, టీడీపీతో పొత్తు గురించి ఈ మ‌ధ్య భాజపా నేత‌లు త‌ర‌చూ ఏదో ఒక కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏ రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ఆ రాష్ట్రంలోనే అన్న‌ట్టుగా  తెలుగుదేశం వ్య‌వ‌హ‌రిస్తోంది. తెలంగాణ‌లో తెలుగుదేశం బాగా వీక్ గా ఉంది కాబ‌ట్టి, అక్క‌డ భాజ‌పాతో పొత్తు అవ‌స‌రం అనే సంకేతాలు  ఇస్తున్నారు.


ఆంధ్రాలో ఆ అవ‌స‌రం ప్ర‌స్తుతానికి లేదు కాబ‌ట్టి.. పొత్తు పెట్టుకోకుండా ఉన్న‌ట్ట‌యితే ఇంకా మెజారిటీ వ‌చ్చేద‌ని నాని లాంటివాళ్లు ఇప్పుడు తీరిగ్గా అంటున్నారు. ఇప్పుడు నాని మాట‌ల్లోని ధీమా 2014లో ఏమైంది..? స‌రే, ఏపీ విష‌యంలో ఇదే ధీమా, అంటే భాజ‌పా అవ‌స‌రం లేద‌న్న ధీమా 2019లో కూడా ఉంటుందా..?


మరింత సమాచారం తెలుసుకోండి: