Image result for NTR in the role of Krishna with panchajanya


* ఏపీలో కొంతమంది పీఠాలు కదులుతాయి.

*తమది స్వచ్ఛంద సంస్థ కాదు, రాజకీయ పార్టీ.

* బీజేపీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటాం.

* బీజేపీ హత్యా రాజకీయాలని సమర్థించదు.

Image result for jagan meets modi

పై మాటలు అన్న వ్యక్తి బీజేపీకి చెందిన అనుభవజ్ఞుడు, అలగా గా మాట్లాడే స్వభావం లేని రాజకీయ నాయకుడు కన్నా లక్ష్మి నారాయణ. అందుకే ఆయన  వ్యాఖ్యలు ప్రజల్లో  ఆసక్తిని రేపాయి.


మొదటి వ్యాఖ్య ఎవరిని ఉద్దేశించి అన్నారు?  అని ప్రశ్నించుకుంటే మన మదికి ఠక్కున తట్టే సమాధానం “ఖచ్చితంగా చంద్రబాబును ఉద్దేశించే” అని అనిపిస్తుంది. ఎందుకంటే హతుడు వైసిపి కి చెందిన వారు. హతకులు టిడిపికి చెందినవారు అని అంటున్నారు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ హత్యలు అనబడేవాటిలో సింహభాగం ఇలాంటివే. రాజకీయ  విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు.

అంతే కాదు, కర్నూలు లో జరిగిన హత్యకాండను బిజెపి నాయకుడైన కన్నా నిర్ద్వందంగా నిష్కర్షగా  సుత్తిలేకుండా సూటిగా ఖండించారు కూడా.

Image result for andhra pradesh TDP MLAs


రెండో-మూడో వ్యాఖ్యలు చంద్రబాబుకు అతి తేలికగా దక్కని పీఎం అపాయింట్మెంట్ జగన్ కు దక్కడం,  అతి సునా యాసంగా, అదీ బాబు భారత్ లో లేని సమయంలో, ప్రత్యెకంగా పిలిపించుకొని మరీ!

అయితేనేం, తర్వాత జరిగిన వివిధ పరిణామాలు బీజేపీ, తెలుగుదేశం పార్టీల మధ్య సఖ్యత అంతగా లేదనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి.

ఇదే సందర్భంలో, చర్విత చర్వణంగా, ఆనవాయితీగా ప్రత్యర్ధులపై దాడిచేసే టిడిపి ప్రత్యెక దళాలు, వరుసగా మోడీని కలసినందుకు జగన్ మోహన్ రెడ్డి పై అతి తీవ్రంగా దాడి చేయటం - మరోరకంగా అపాయింట్-మెంట్ ఇచ్చిన ప్రధాని నరెంద్ర మోడీని పరోక్షంగా తాకటం - బిజెపి గమనిస్తూనే, చేసిన వ్యాఖ్యగా - కన్నా నోటినుండి కొంత కారంగా, మరికొంత వెగటుగా, ఇంకొంత చేదుగా, టిడిపికి సుతరామూ ఇష్టంలేని పత్యం తిన్నట్లు వినిపిస్తుంది.

"నువ్వుకాకపోతే ఇంకొకడు" అన్న కన్నా స్వరంలో ద్వనించిన దీమా ప్రతి ద్వనించింది కదా!  అంటారు విశ్లేషకులు. పరొక్షంగా “వైసిపి నైనా కలుపుకుంటాం. మా పార్టీ ఎదగాలి. మాగురించి మీరు ప్రతిపక్షాన్ని మించి మిన్నగా అనెక సంధ్ర్భాల్లో అన్న మాటలూ మాకు బాగానే గుర్తున్నాయి అనేది స్వరం లో ద్వనించిందని” పించింది జనసామాన్యానికి. 

Image result for andhra pradesh TDP spokes persons

నాలుగో వ్యాఖ్య మీరు చేసే హింసా రాజకీయాలను మాత్రమే కాదు ఏరకమైన తప్పులనైనా మీ మిత్రపక్షంగా మేము చూస్తూ ఎంతో కాలం సహించం అనే అభిప్రాయం ప్రకటించారు కన్నా!  ఇదే సందర్భంలో, ఈ నేపథ్యంలో, కన్నా చేసిన తొలి హెచ్చరిక టిడిపికి దాని నాయకత్వానికి చెంపపెట్టనే అర్ధమౌతుంది.

త్వరలోనే ఏపీ లో కొంతమంది పీఠాలు కదులుతాయి అని కన్నా చేసిన హెచ్చరిక  ఆసక్తికరంగా, నాటి కురుక్షెత్రంలో శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్య శంఖద్వని అని అంటున్నారు విజ్ఞులు.  అది శ్రీకృష్ణుడు ఎప్పుడు పూరించాడో విజ్ఞులకు తెలుసు కాబట్టి!

Image result for andhra pradesh TDP spokes persons

'అమిత్ షా'  రాక కూడా టిడిపి-బిజెపి మైత్రికి అపస్వరమేమో?  అంటుంది ఏపి ప్రతిపక్షం ఆనందంగా.  సమాదానం దొరకాల్సిన ప్రశ్న ఎవరి పీఠాలు కదులుతాయో? వేచి చూడాలి.

Image result

మరింత సమాచారం తెలుసుకోండి: