సాత్నా జిల్లాలో ఉండే సోని అనే వ్యక్తికి పాకిస్థాన్ కు చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఆ కాల్ సారాంశం ఏంటంటే...ప్రధానమంత్రిని లేపేయాలి. అందుకు రూ.50 కోట్లు ఇచ్చేందుకు రెడీ. ఈ డీల్ నచ్చకపోతే ఇంకొంత మొత్తం ఇచ్చేందుకు కూడా వారు సిద్ధమయ్యారు. ముందుగా ఈ ఫోన్ కాల్ను సోనీ పట్టించుకోలేదు అయితే తర్వాత ఆయన ఆలోచనలో పడ్డారు. ప్రధానమంత్రిని మర్డర్ చేసేందుకు ఎంత పెద్ద స్కెచ్ వేశారో తెలిసిన వ్యక్తిగా ఆ విషయాన్ని చెవిన వేయడం తన బాధ్యతగా భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు మొదలుపెట్టారు.

 

అసలు సోనీకి వచ్చిన కాల్ నిజమైనదేనా? ఎవరైనా ఆకతాయిలు చేశారా? ఉద్దేశపూర్వంగానే సోనీకి కాల్ చేసి ఉంటారా?  లేక ఎవరికో చేయబోయి సోనీకి చేశారా? అనే కోణంలో క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రధానమంత్రి భద్రత విషయంలో కూడా అధికారులు పునఃసమీక్షిస్తున్నారు. ఆయన పర్యటనల సమయంలో ఇకనుంచి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని కసర్తతు చేస్తున్నారు

 


మరింత సమాచారం తెలుసుకోండి: