Image result for TDP congress relation in telangana

ఒకవైపు అంధ్రప్రదేశ్ లో బాజపాతో బలహీనపడుతున్న మైత్రి మరోవైపు తెలంగాణాలో పూర్తిగా నిర్వీర్యమైపోయిన తెలుగుదేశం భాగ్యరెఖలు తెలుగు తమ్ముళ్ళ బాహాబాహీ లతో బాహాటంగానే రోడ్డెక్కాటమే కాదు అతి హీనాతిహీన ఫాక్షన్ హత్యారాజకీయాల్లో మాకంటే ఘనులెవరూ లేరన్నంతగా క్షీణిస్తున్నాయి. టిడిపి భాగ్య విధాత నందమూరి తారక రామారావు కృషి ఫలితంగా తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వస్తూనే ఫాక్షన్ క్రమంగా అంతరించసాగింది.


అయితే ఈ మద్య రాజకీయ ప్రయోజనాలకోసం నేటి ఆ పార్టి అధినేత చేసిన ఘోర తప్పిదం అంటే ప్రతిపక్ష శాసనసభ్యులను తమ పార్టీలోకి చేర్చుకొని బలోపేతం చేసే నేపంతో ప్రతిపక్షాన్ని అంతమొందించే కార్యక్రమం దిగ్విజయంగా ముగించారు. దాంతొ ఫాక్షన్ నాయక ప్రతినాయకులు ఇరువుతికి ప్రభుత్వ అండ దొరకటం తో నువ్వా? నేనా? అనే విధంగా వీధిపోరాటాలు మొదలై పార్టీ పరువు కాస్తా వీధిన పడింది. అంతేకాదు బాబు ఎన్నికల్లో చేసిన నేర్వేర్చలేని వాగ్ధానాలు, కేంద్రంతో బెడిసిన సంభందా లు, అమరావతి పేరుతో సాగిన భూదందా వికృత క్రీడ ఆ పార్టీ నాయకత్వ సామర్ధ్యమే కాదు, పెల్లుబుకుతున్న అవినీతి, బందు ప్రీతితో ఇతర ప్రజానీకానికి అమరావతి మనది కాదనే భావం బలపడి టిడిపి పై నమ్మకం విశ్వాసం పూర్తిగా సన్నగిల్లటంతో రానున్న ఎన్నికల్లో ప్రజలను ఓట్లు వేయమని అడిగే అవకాశాన్ని కోల్పోయింది.  


అందుకే 2019 లో గెలుపుకోసం అక్రమ సంభందాల కోసం ప్రాకులాట మొదలెట్టింది. తెలంగాణాలో తమ పార్టీ జన్మకే కారణమైన ఆగర్భశత్రువు కాంగ్రెస్ తో జతగట్టతానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. గతం తో కమ్యూనిస్టులతో బెడిసిన అక్రమసంభందం దృష్ట్యా ఆంద్రలో అలాంటి పొత్తులకు అవకాశం లేకపోవటంతో దొడ్డిదారి మార్గం వెతుకు తుందని అభిజ్ఞ వర్గాల అభిప్రాయంగా తెలుస్తుంది.


పవన్ కళ్యాణ్ జనసేన తో "లోపూచి ఒప్పందం" ద్వారా దాంట్లొకి కమ్యూనిష్టులను చొప్పించి వంగతోట రాజకీయాలు మొదలెట్టే వ్యూహం పన్నింది. జనసేనతో కొంతకాలం టిష్యూ-పేపర్ అనుభందం నెరిపి ఎన్నికల్లో తన పబ్బంగడుపుకొనే వ్యూహం సిద్ధంచేసుకుంటుందని జనసామాన్యానికే అరి సునాయాసంగా అర్ధమౌతుంది. ఇదంతా బహుశ తెలుసుకున్న "నమో-షా" లు వ్యూహాత్మకంగా వైసిపి తో మైత్రికి మార్గాలు సుగమం చేసుకుంటున్నాయని తెలుస్తుంది.    


అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ, తెలుగుదేశం పార్టీ  పొత్తుల కోసం తహతహలాడుతూ ఆబగా అదికారం దండుకోవాలని  ఉబలాటపడుతోంది. ఏపీలో 2014 ఎన్నిక ల్లో బీజేపీ, పవన్ కల్యాణ్ లను కలుపుకుని వెళ్లింది తెలుగుదేశం. అంత మందిని అంటే పద్దెనిమిది అక్షోహిణుల సైన్యమున్నా కూడా వారందరిని కూడగట్టి కలుపుకుని ముందుకు  పోయి కూడా, జగన్ కన్నా కొన్ని  ఎక్కువ సీట్లను మాత్రమే సాధించుకోగలిగింది టీడీపీ. తెలంగాణ విషయానికి వస్తే,  ఇదే పొత్తు ఫలించలేదు.

Image result for TDP congress relation in telangana 

తెలుగుదేశం పార్టీ తరపున కొంత మంది ఎమ్మెల్యేలు గెలిచినా వారంతా జెండా ఎత్తేశారు. తెరాసలో చేరిపోయారు. మరి వచ్చే ఎన్నికల్లో ఎలా?  అని తెలుగుదేశానికి భయం పట్టుకుంది. ఈ భయంతో అప్పుడే పొత్తుల కోసం చూపులు చూస్తోంది. విడ్డూరం ఏమిటంటే, తమ ఆ గర్భశత్రువుతో చేతులు కలపడానికి, అక్రమ పడక పంచుకోవటానికి తెలుగుదేశం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉండటం, గమనార్హం.


అంతకు మించి "బ్రీఫ్డ్-మి" తో నడిబజార్లో బట్టలూడదీయించు కున్న ఆ పార్టీకి ఓట్లు పడేది కల్లే నంటున్నారు తెలంగాణా జనం. అంతేకాదు హైదరాబాద్ ను రాజధానిగా అనుభవించే హక్కును తనంతట తాను పారిపోయి కోల్పోయిన ఆ నాయకత్వానికి ఏం చేసినా ఇక్కడ మనుగడ అసాధ్యమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పాలన దశాబ్దాల పాటు సాగిన తర్వాత తెలుగుదేశం ఆవిర్భవించింది. గ్రామ స్థాయి ల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ అభిమానుల మధ్య హత్యా రాజకీయాల పరిస్థితులే ఉంటాయి. మరి అలాంటి కాంగ్రెస్ తో చేతులు కలపడానికి టీడీపీ సై అంటుండటం విశేషమనే చెప్పాలి.


తెలుగు దేశం, కాంగ్రెస్ లు కలిసి బరిలోకి దిగాలని టీడీపీ నేతల నుంచే ప్రకటనలు వస్తున్నాయి. మరి ఏపీలో కాంగ్రెస్ తో శత్రుత్వం, కేంద్రంలో బీజేపీతో సాంగత్యం, తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తా, తెలుగుదేశం రాజకీయ జార త్వానికి సరిహద్దులు లక్ష్మణ రెఖలు ఉండవన్నది గత నాలుగు దశబ్ధాల్లో ప్రజలెరిగిన సత్యం అంటున్నారు తెలంగాణా వాసులు. అసలు తెలుగు దేశం పార్టీ ఆ రెండు జిల్లాల దురాశా ఫలితమే పచ్చనైన ఆంధ్రప్రదేశ్ విభజనకు దారి తీశాయన్నది ఇరు రాష్ట్రా ల భావన.  ఇక కాలమే చూపుతుంది జరగనున్న "అక్రమ వికృత పొత్తుల కేళి" 

మరింత సమాచారం తెలుసుకోండి: