ఇటీవల కర్నూలు జిల్లా ప్రత్తికొండ నియోజక వర్గ వైసీపీ ఇన్ చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. నారాయణరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కేఈపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీలో చురుకుగా పనిచేస్తూ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇంతలోనే ఆయన హత్య జరిగింది. 



నారాయణరెడ్డి హత్యపై చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తిలపై జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు సూత్రధారి... కృష్ణమూర్తి పాత్రధారి అంటూ జగన్ విరుచుకుపడ్డారు. ఆ తర్వాత కడప జిల్లాలో కీలక ప్రకటన చేశారు. పులివెందులలొ పార్టీ కార్యాలయం వైఎస్ రాజారెడ్డి భవన్ ను ప్రారంభించిన అనంతరం అయన ప్రత్తికొండ నియోజకవర్గంపై  మీడియాతొ మాట్లాడారు. 

Image result for ysrcp narayanareddy wife

 నారాయణరెడ్డిని చంపితే పొటీ ఉండదని అనుకొవడం పొరపాటని కామెంట్ చేసిన జగన్.. ఆయన స్దానంలొ ఇప్పుడు ఆయన భార్యను పోటీలో నిలుపుతామన్నారు. రానున్న ఎన్నికల్లొ నారాయణ రెడ్డి భార్య   50 వేల ఓట్లతొ గెలుస్తుందన్నారు. సిఎంకు త్వరలొనే దేవుడు, ప్రజలే సమాధానం చెబుతారన్నారు. నారాయణరెడ్డి హత్యలొ ప్రధాన ముద్దాయి డిప్యూటి సిఎం అన్నారు. 



ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్ లొనే  ఈ హత్య జరిగిందని జగన్ ఆరోపించారు. ఈ హత్యపై సిబిఐ చేత విచారణ చేట్టాలని డిమాండ్ చేశారు. నరేంద్రమోడిని కలవడంపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపధ్యంలొ ఆ అంశంపైనా జగన్ స్పందించారు. ఏకగ్రీవమైతే బాగుంటుందనే రాష్టపతి ఎన్నికల్లొ ఎన్డీఎకు మద్దతిస్తామని చెప్పామన్నారు. గతంలో అసెంబ్లీ స్పీకర్ గా కొడెల శివప్రసాదరావు విషయంలొను తాము వ్యతిరేకించలేదని, బలం ఎవరికి ఎక్కువ ఉంటే వారికే అవకాశం ఉంటుందన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: