ఈనాడు దిన పత్రిక గురువారం తన ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో ప్రచురించిన ఆ దివాలా.. మనకేలా.. అనే కథనం నిజంగా అద్భుతంగా ఉంది. అణువిద్యుత్ అంటే సహజంగా చాలామందికి కొరుకుడుపడని క్లిష్టమైన సబ్జెక్ట్.. అందులోనూ ఆ ఒప్పందాలు.. అవీ ఒక పట్టాన అర్థం కావు.. ఈ విషయంలో కొవ్వాడ అణువిద్యుత్ కర్మాగారాన్ని నిర్మించాల్సిన కంపెనీ అమెరికాలో దివాలా తీసిందన్న వాస్తవాన్ని ఈనాడు బాగా ఫోకస్ చేసింది. 
 Image result for కొవ్వాడలో మొత్తం ఆరు రియాక్టర్ల

ఈ కొవ్వాడ అణువిద్యుత్ కర్మాగారం కోసం కేంద్రం లక్షన్నర కోట్లు వెచ్చిస్తోందట. ఐతే.. ఈ ప్రాజెక్టు నిర్మాణం అమెరికాకు చెందిన ఓ దివాలా కంపెనీ చేతుల్లో ఉందట. ఈ ప్రాజెక్టుకు అణు రియాక్టర్లను సరఫరా చేయాల్సిన అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ ఈ ఏడాది మార్చి నెలాఖరున తనను దివాలా కంపెనీగా ప్రకటించమని కోరిందట.  



కొవ్వాడలో మొత్తం ఆరు రియాక్టర్లతో 7 వేల 248 మెగావాట్ల కర్మాగారం ఏర్పాటు చేయాలనుకున్నారు. ఒక్కో మెగావాట్ కు 20 కోట్ల వంతున లక్షా 44 వేల 960 కోట్ల రూపాయల వ్యయం  అవుతుందట. తొలిదశలో పెట్టదల్చుకున్న 2 రియాక్టర్లకే 48 వేల 320 కోట్ల వ్యయం అవుతుందట. ఇవన్నీ జస్ట్ బిగినింగ్ లెక్కలట. ముందు ముందు ఇవి భారీగా పెరగొచ్చట. 

nuclear power plant కోసం చిత్ర ఫలితం

మరి ఇప్పుడు కేంద్రం ఏం చేస్తోంది.. ఈ కంపెనీతో ఒప్పందం రద్దు చేసుకుంటుందా.. వేరొకరికి ఈ పని అప్పగిస్తుందా... మరి కొవ్వాడ రైతుల సంగతేంటి.. ఇప్పటికే భూ సేకరణ ప్రారంభించేశారు. ఇప్పుడు అంతా గందరగోళం అవుతుందా.. లేక ప్రక్రియ సజావుగా సాగుతుందా.. తెలిసీ తెలిసీ కేంద్రం దివాలా కంపెనీతో కలసి ముందడుగు వేస్తుందా.. చూద్దాం.. 

( ఈనాడు సౌజన్యంతో.. )


మరింత సమాచారం తెలుసుకోండి: