తెలుగు సినిమాల్లో ఫ్యాక్షన్ తరహా చిత్రాలకు చాలా ప్రాదాన్యత ఇస్తారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ సినిమా అనగానే నందమూరి బాలకృష్ణ గుర్తుకు వస్తారు.   ఈ మద్య సినిమాల్లో ఫ్యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలు కొన్ని కావాలనే కల్పిస్తున్నారు. కొన్ని సినిమాల్లో ఫ్యాక్షన్ గొడవలు కామెడీగా కూడా చిత్రీకరిస్తున్నారు.  ఏది ఏమైనా ఫ్యాక్షన్ గొడవలు చాలా దారుణంగా ఉంటాయని మనకూ తెలిసిన విషయమే.  పగలూ ప్రతీకారాలు సీమలో కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా  కర్నూలు పత్తికొండ వైసీపీ నాయకుడు నారాయణ రెడ్డి ని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.  
Image result for ysrcp leader narayana reddy murder
నారాయణ రెడ్డి హత్యకి కారణం అయిన 12 మందిని అరెస్టు చేసారు. ఈ సందర్భంగా హత్య చేయడానికి గల కారణాలని వారు చెప్పారు.  నారాయణ రెడ్డి దయా దాక్షిణ్యాలు లేకుండా తమ తాతలు, తండ్రులని దారుణంగా చంపేశారని, అక్కడితో ఆగకుండా తమ భూములని అక్రమంగా లాక్కుని మాతోనే సిస్తు కట్టించుకున్నాడని, అందుకే అతన్ని హత్య చేసామని బీసన్న రామాంజనేయులు, కోతుల రామాంజనేయులు చెప్పారు. అయితే నారాయణను చంపడానికి పెద్ద పెద్ద ప్లానింగులు ఏమీ వేయలేదని..గత రెండు రెండు రోజుల నుంచి ఆయనను ఫాలో అయ్యామని హత్యలో వాడిన ట్రాక్టర్లు మావే అని వారు వాంగ్మూలంలో పేర్కొన్నారు.
Image result for ysrcp leader narayana reddy murder
కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు మా మీద ఒత్తిడి తెచ్చి నారాయణ రెడ్డి మీద వున్న కేసులని ఉపసంహరించుకునేలా చేసాడని..దాంతో ఆ ఊరి నుంచి తాము వెళ్లి బయటనే ఉంటున్నామని అన్నారు.  కొద్ది రోజుల క్రింతం మరల ఊరిలో అడుగుపెట్టామని, మా రాకని గుర్తించి, నారాయణరెడ్డి తన కుటుంబాన్ని మరో చోట ఉంచాడని అన్నారు. అయితే అవకాశం కోసం చూసామని, అదును చూసుకొని హత్య చేసామని చెప్పారు. ఇందులో ఎవరి ప్రమేయం లేదని, కేవలం నారాయణ రెడ్డితో మా కుటుంబానికి వున్న పాత కక్షల కారణంగానే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: